Begin typing your search above and press return to search.

ఇండియా టుడే కవర్ పేజీపై ఐకాన్ స్టార్..!

By:  Tupaki Desk   |   15 July 2022 1:30 PM GMT
ఇండియా టుడే కవర్ పేజీపై ఐకాన్ స్టార్..!
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా.. ఐకాన్ స్టార్ గా అవతరించాడు. 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ.. గతేడాది చివర్లో 'పుష్ప: ది రైజ్' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2021లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా హిందీ సర్క్యూట్స్ లో ఈ సినిమా ఊహించని విధంగా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక పుష్పరాజ్ గా బన్నీ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ మేనరిజం.. 'తగ్గేదే లే' అంటూ చెప్పిన డైలాగ్స్ మరియు అతని స్వాగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. 'పుష్ప' పార్ట్-1 వచ్చి ఏడు నెలల కావొస్తున్నా.. పుష్పరాజ్ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది.

'పుష్ప' మూవీతో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఇండియా టుడే కవర్ పేజీ మీదకెక్కాడు. పాపులర్ మ్యాగజైన్ బన్నీ ముఖ చిత్రాన్ని ప్రచురిస్తూ.. 'ది సౌత్ స్వాగ్' అని పేర్కొంది. దక్షిణాది సినిమాలు.. అందులోని ప్రముఖ నటీనటుల క్రాస్ ఓవర్ సక్సెస్ వెనుక రహస్యం అని వివరించింది.

ఇందులో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. పుష్పరాజ్ మేనరిజమ్ తో తగ్గేదే అని పోజ్ ఇచ్చాడు. ఇండియా టుడే తన కవర్‌ పై బన్నీ ని ప్రచురించడం ద్వారా భారతీయ సినిమాలో దక్షిణాది ఆధిపత్యం గురించి మరియు కేవలం ఒక పాన్ ఇండియా చిత్రంతో అతను సృష్టించిన క్రాస్‌ ఓవర్ వాల్యూ గురించి మాట్లాడుతుంది.

ఒక ప్రముఖ మ్యాగజైన్ పై అల్లు అర్జున్ ఫోటోని ఫీచర్ గా ఉంచారు అంటే.. ఐకాన్ స్టార్ సృష్టించిన ప్రభావం భారీగా ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

అల్లు అర్జున్ ఇప్పుడు 'పుష్ప: ది రూల్' సినిమాని ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. రెండో భాగంపై నెలకొన్న అంచనాల దృష్ట్యా.. పుష్ప ఫస్ట్ పార్ట్ కి మించి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రెడీ చేయనున్నారు. మరి 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.