Begin typing your search above and press return to search.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సరికొత్త సమస్య!
By: Tupaki Desk | 22 Feb 2023 9:30 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. బన్నీని పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేర్చింది. ఊహించని విధంగా వరల్డ్ వైడ్ గా క్రేజ్ ని తెచ్చి పెట్టిన ఈ మూవీ బాలీవుడ్ లో 100 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టించింది. ఈ నేఫథ్యంలో పార్ట్ 2ని మరిన్ని ప్రత్యేకతలతో తెరపైకి తీసుకొస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ ని మించి 350 కోట్ల బడ్జెట్ తో `పుష్ప 2`ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ దృష్టి మొత్తం ఈ ప్రాజెక్ట్ పైనే వుంది. మరో సారి `పుష్ప` ఫస్ట్ పార్ట్ కి మించిన విజయాన్ని పార్ట్ 2 తో దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటూ పార్ట్ 2 కోసం బన్నీ, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ వారు పని చేస్తున్నారు. దీంతో పార్ట్ 2పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతోంది.
అయితే బన్నీకి కొత్త టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. `పుష్ప`తో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న బన్నీ `పుష్ప 2` తరువాత తన ఇమేజ్ కి తగ్గట్టుగా ఎలాంటి కథలు చేయాలి?.. మరీ ముఖ్యంగా ఏ దర్శకుడితో తన తదుపరి ప్రాజెక్ట్ ని డిజైన్ చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు బన్నీని టెన్షన్ పెడుతోందట. దానికి కారణం బన్నీతో సినిమా చేయడానికి టాలీవుడ్ లో ఏ దర్శకుడు కూడా ఖాలీగా లేకపోవడమే అని తెలుస్తోంది.
రాజమౌళి నుంచి వంశీ పైడిపల్లి వరకు ప్రతీ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా వున్నారు. రాజమౌళి త్వరలో మహేష్ తో సినిమాకు రెడీ అవుతుండగా ప్రశాంత్ నీల్ `సలార్` తరువాత ఎన్టీఆర్ తో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. పోనీ సందీప్ రెడ్డి వంగాతో చేద్దామా అంటే తను కూడా ఖాలీగా లేడు. ప్రస్తుతం `యానిమల్` చేస్తున్న సందీప్ ఆ తరువాత ప్రభాస్ తో `స్పిరిట్` చేయబోతున్నాడు. అంటే రెండేళ్ల వరకు తను దొరికే ఛాన్స్ లేదు.
మళ్లీ సుకుమార్ అంటే కష్టం.. ఇక తమిళ డైరెక్టర్లలో శంకఱ్ తో సినిమా చేయాలన్నా కష్టంగానే వుంది. కారణం ప్రస్తుతం చరణ్ తో సినిమా చేస్తున్న శంకర్ ఇదే సమయంలో కమల్ తో `ఇండియన్ 2` ని చేస్తున్నాడు. దీని తరువాత రణ్ వీర్ సింగ్ తో సినిమా చేయబోతున్నాడు. అంటే తను కూడా ఖాలీ లేడన్నమాట. క్రేజీ డైరెక్టర్లని పక్కన పెట్టి ఇతర దర్శకులతో చేయడానికి బన్నీ సిద్ధంగా లేడు. ఎప్పుడో చేయాలనుకున్న లింగుస్వామి, మురుగదాస్ ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయారు. దీంతో నెక్స్ట్ ఎవరితో అన్నది బన్నీని టెన్షన్ పెడుతోందట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.