Begin typing your search above and press return to search.

నిర్మాత బ‌న్నీవాసుకి బ‌ర్త్ డే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   11 Jun 2021 9:48 PM IST
నిర్మాత బ‌న్నీవాసుకి బ‌ర్త్ డే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న స‌న్నిహితుల్ని ఎంతో అప్యాయంగా చూసుకుంటూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో త‌న బెస్ట్ ఫ్రెండ్, ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు పుట్టిన రోజు సంద‌ర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. ప్ర‌తి ఏడాది ఈరోజున అల్లు అర్జున్, బ‌న్నీవాసుగారిని స్వ‌యంగా క‌లిసి పుట్టిన రోజు శుభ‌కాంక్ష‌లు తెలుపుతుంటారు కానీ ఈసారి ప‌ని రీత్య బాంబెలో ఉన్నారు బ‌న్నీవాస్, అయిన‌ప్ప‌టికీ బాంబే వెళ్లి మ‌రీ త‌న బెస్ట్ ఫ్రెండ్ బ‌న్నీవాసుకి బ‌ర్త్ డే విషెస్ తెలిపి, ఓ స్వీట్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 22 ఏళ్లుగా వీరిద్ద‌రి స్నేహం కొన‌సాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు త‌న త‌న‌య‌డు అయాన్, ప్ర‌ముఖ నిర్మాత‌లు యూవీ క్రియేష‌న్స్ వంశీ, కేధార్ లు కూడా బ‌న్నీ వాసుని క‌లిసి పుట్టినరోజు శుభ‌కాంక్ష‌లు తెలిపారు. ఎంతో బిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న కోసం స్వ‌యంగా బాంబే వ‌చ్చి మ‌రి ఈ విధంగా బ‌ర్త్ డే విషెస్ తెలుప‌డం ప‌ట్ల, నిర్మాత బ‌న్నీవాస్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. త‌న‌తో పాటు తన చుట్టూ ఉన్న‌వారు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాల‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకుంటూ ఉంటార‌ని బ‌న్నీవాసు అన్నారు.