Begin typing your search above and press return to search.

`ఆహా పురం`లో పుష్ప‌రాజ్ హంగామా

By:  Tupaki Desk   |   31 Dec 2021 11:30 AM GMT
`ఆహా పురం`లో పుష్ప‌రాజ్ హంగామా
X
ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. వ‌రుస హిట్ సినిమాల‌ని ఆన్ లైన్ ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. మైహోమ్ అధినేత జూప‌ల్లి రామోశ్వ‌ర‌రావుతో క‌లిసి స్టార్ ప్రొడ్యూస‌ర్, మాస్ట‌ర్ మైండ్ అల్లు అర‌వింద్ ఈ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టాక్ షోల‌ని ప్రారంభించి సూప‌ర్ హిట్ చేశారు. దీంతో ఆహాకు స‌రికొత్త ఊపొచ్చింది.

ముందు స‌మంత‌తో `సామ్ జామ్ స‌మంత‌` పేరుతో సెల‌బ్రిటీ టాక్ షోకి శ్రీ‌కారం చుట్టిన ఆహా టీమ్ దీన్ని ప్ర‌ముఖ సెల‌బ్రిటీల‌తో ఫుల్ ఆఫ్ ప్యాక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షోగా మ‌లిచి తొలి సీజ‌న్‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. ఆ త‌రువాత కొంత విరామం తీసుకుని ఈ సారి మ‌రో కొత్త టాక్ షోతో ఎంట‌ర్‌టైన్ చేయ‌డం మొద‌లుపెట్టింది. అదే `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బీకె`. దీనికి నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

త‌న‌దైన స్టైల్ పంచ్ ల‌తో స్టార్‌ ల‌ని ఆట‌ప‌ట్టిస్తూ పేరుకు త‌గ్గ‌ట్టే అన్ స్టాప‌బుల్ గా దూసుకుపోతున్నారు. ఈ సీజ‌న్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎపిసోడ్ తో ఎండ్ కాబోతోంది. ఈ టాక్ షోతో `ఆహా`కు మ‌రింత పాపులారిటీ.. స‌బ్స్ క్రైబ‌ర్స్ భారీ స్థాయిలో పెరిగారు. ఈ నేప‌థ్యంలో `ఆహా`కు మ‌రింత జోష్ ని యాడ్ చేసి భారీ స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించ‌డం కోసం స్వ‌యంగా పుప్ప‌రాజ్ అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. `ఆహా` ఓటీటీ ప్ర‌మోష‌న్ కోసం `సినిమా పురం` పేరుతో స‌రికొత్త క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ని విడుద‌ల చేశారు.

ఇందులో బ‌న్నీ న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన పంచ్ ల‌తో అద‌ర‌గొట్టేశాడు. బ్లాక్ డ్రెస్ లో కాషాయం రంగు త‌ల‌పాగా చుట్టేసి క‌నిపించాడు. `ఏయ్ సెక్రెట్రీ ఇప్పుడు సినిమా పుర‌మే కాద‌య్యా.. అనంత‌పురం.. అమ‌లా పురం.. అశ్వాపురం...ఆఖ‌రికి ఏ అమెరికా పురం కూడా `ఆహా పురం` అయ్యాయిగా.. ప్ర‌తీ శుక్ర‌వారం `ఆహా`లో కొత్త సినిమా రిలీజ్` అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగ్ తో ప్రోమో ఎండ్ అయింది. ఆహా పురం అంటూ ఈ యాడ్‌లో పుష్ప‌రాజ్ చేసిన హంగామా ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

అన్న‌ట్టు బ‌న్నీ న‌టించిన `పుష్ప‌` బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. రెంఉ వారాల్లోనే `పుష్ప‌` ఉత్త‌రాదిలో డ‌బ్బింగ్ వెర్ష‌న్ రికార్డు స్థాయిలో కేవ‌లం రెండు వారాల‌కే 46.85 కోట్ల గ్రాస్ సాధించిన నాలుగ‌వ చిత్రంగా నిలిచింది. త్వ‌ర‌లో 50కోట్ల‌ మార్కుని దాటి ఉత్త‌రాది లో స‌రికొత్త రికార్డుని సృష్టించ‌డం ఖాయంగా చెబుతున్నారు.

బ‌న్నీ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది విడుద‌లైన చిత్రాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన బెస్ట్ మూవీగా నిలిచింది. `ఆర్ ఆర్ ఆర్ ` జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో `పుష్ప‌` హ‌వా జ‌న‌వ‌రి 6 వ‌రకు వుంటుందా? లేక అలాగే కొన‌సాగుతుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.