Begin typing your search above and press return to search.
డిసెంబర్ నుంచి ఐకాన్ రెగ్యులర్ షూటింగ్
By: Tupaki Desk | 7 Sept 2021 3:01 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప-1` చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డ్యూయాలజీలో మొదటి భాగం పూర్తి చేసిన అనంతరం `ఐకాన్` చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తాజా సమాచారం మేరకు.. ఈ అక్టోబర్ లోనే అల్లు అర్జున్ ఐకాన్ లాంచ్ కానుంది. ఇప్పుడు దాని కోసం వేదిక సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చుతున్న నిర్మాత దిల్ రాజు వచ్చే నెలలో సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
అక్టోబర్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఐకాన్ లో కథానాయికగా పూజా హెగ్డే.. కృతి శెట్టి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
బన్ని కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప 1 ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని ప్రచారమవుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పుష్పలో బన్ని సరసన రష్మిక మందన కథానాయిక. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.