Begin typing your search above and press return to search.

'ఐకాన్' మా నెక్స్ట్ ప్రాజెక్ట్: దిల్ రాజు

By:  Tupaki Desk   |   17 April 2021 11:30 AM GMT
ఐకాన్ మా నెక్స్ట్ ప్రాజెక్ట్: దిల్ రాజు
X
వేణు శ్రీరామ్ తెరకెక్కించిన 'వకీల్ సాబ్' సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అందరి చూపు అతనిపై పడింది. 'పింక్' రీమేక్ కి కమర్షియల్ హంగులు జోడించి మెప్పించిన వేణు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ దశలో ఆగిపోయిన 'ఐకాన్ - కనబడుటలేదు' సినిమా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రెండేళ్ల క్రితం ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా చేసే ఛాన్స్ రావడంతో వేణు శ్రీరామ్ 'వకీల్ సాబ్' మీద దృష్టి సారించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో సైతం వేణు 'ఐకాన్' సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే 'వకీల్ సాబ్' విడుదల తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

'ఐకాన్' సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారనే వార్తలను నిజం చేస్తూ.. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు తాము వెంటనే చేయబోయే సినిమా 'ఐకాన్' అని వెల్లడించారు. ''ఇమిడియేట్ గా మేము చేసింది 'ఐకాన్' సినిమానే. అది నా మనసుకు నచ్చిన కథ. వేణు లైన్ చెప్పినప్పటించే దానిపై ట్రావెల్ అయ్యాం. పూర్తి స్థాయి స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. వేరే కారణాల వల్ల కాస్త ముందుకు వెనుకకు జరుగుతుంది అంతే. మంచి కథ మా దగ్గర ఉంది. అది మంచి సినిమా అవుతుంది. త్వరలోనే దీని స్టార్ట్ చేస్తాం'' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీంతో 'ఐకాన్' ప్రాజెక్ట్ పై క్లారిటీ రావడమే కాకుండా.. 'పుష్ప' సినిమా తర్వాత బన్నీ చేసే సినిమా కూడా ఇదేనని అర్థం అవుతుంది. కొరటాల శివ ఎలాగూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి, అల్లు అర్జున్ స్క్రిప్ట్ రెడీగా ఉన్న 'ఐకాన్' కే పచ్చజెండా ఊపనున్నాడని తెలుస్తోంది.