Begin typing your search above and press return to search.

సుశాంత్ 'IVNR' సెన్సార్ పూర్తి.. పార్కింగ్ కి లైన్ క్లియర్..!

By:  Tupaki Desk   |   17 Aug 2021 7:30 AM GMT
సుశాంత్ IVNR సెన్సార్ పూర్తి.. పార్కింగ్ కి లైన్ క్లియర్..!
X
'చిలసౌ' వంటి సూపర్ హిట్ తర్వాత సుశాంత్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ''ఇచ్చట వాహనములు నిలుపరాదు''. 'నో పార్కింగ్' అనేది దీనికి ఉప శీర్షిక. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 27న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించిన చిత్ర యూనిట్.. సెన్సార్ బోర్డ్ 'U/A' సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 'పార్కింగ్ కి లైన్ క్లియర్' అంటూ సుశాంత్ బైక్ మీద కూర్చొని ఆలోచిస్తున్న ఓ సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు. సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ కు రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నారు.

నావెల్ కాన్సెప్ట్‌ తో ఒక విలక్షణమైన థ్రిల్లర్ గా రూపొందిన IVNR చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ తప్పకుండా ప్రోత్సహిస్తారని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది. వెంకట్ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - అభినవ్ గోమతం - ఐశ్వర్య - నిఖిల్ కైలాస - కృష్ణ చైతన్య ఇతరులు ఇతర పాత్రల్లో నటించారు.

'IVNR' చిత్రాన్ని నిర్మాతలు ర‌విశంక‌ర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన చిత్రాలు ప్రేక్షకాదరణ తెచ్చుకుంటున్న నేపథ్యంలో, స్పెషల్ కంటెంట్ తో వస్తున్న అక్కినేని హీరో ''ఇచ్చట వాహనములు నిలుపరాదు'' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.