Begin typing your search above and press return to search.

చెర్రీ చెర్రీ ఐస్‌ క్రీమ్‌ తినాలనుందా?

By:  Tupaki Desk   |   11 Aug 2015 7:26 AM GMT
చెర్రీ చెర్రీ ఐస్‌ క్రీమ్‌ తినాలనుందా?
X
గాళ్‌ ఫ్రెండ్‌తో ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌ కి వెళ్లి స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌ ఐస్‌ క్రీమ్‌ తిన్న రోజుల్ని అంత తేలిగ్గా మర్చిపోగలమా? కార్నెటోలు, వెనీలా బ్రాండ్‌ లు మనకి కొత్తేమీ కాదుగా. అయితే ఇవన్నీ ఏం టేస్టీ? అసలు సిసలు మస్త్‌ మజా ఇచ్చే ఐస్‌క్రీమ్‌ ఒకటి మార్కెట్లో కి వచ్చింది. రుచి చూస్తారా? అని నోరూరిస్తోంది హైదరాబాద్‌ లోని ఓ ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌. ఈ బ్రాండ్‌ పేరు 'చెర్రీ చెర్రీ' అట. చెర్రీ అమెరెట్టా బ్రాండ్‌ రుచులే రుచులు అంటూ పబ్లిసిటీ చేసేస్తున్నారు పార్లర్‌ ఓనర్లు.

చెర్రీ పైస్‌ కలగలిపిన క్రీమీ ఐస్‌ క్రీమ్‌ ఇది. మనందరి ఫేవరెట్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిక్‌ నేమ్‌ చెర్రీ. ఆ పేరుతోనే ఈ బ్రాండ్‌ ని మార్కెట్లోకి తెచ్చామనని చెబుతున్నారు. అయితే ఈ పార్లర్‌ జూబ్లీహిల్స్ లో ఏ మూలన ఉందబ్బా? అని అడ్రస్‌ కోసం వెతికేస్తున్నారా? ఆల్మోస్ట్‌ ఫేమస్‌ ప్లేసెస్‌ అన్నిచోట్లా ఈ బ్రాండ్‌ ని సప్లయ్‌ చేస్తున్నారట. ఇంకెందుకు ఆలస్యం పదండి అందుకునేందుకు.

ఐస్‌ క్రీమ్‌ అంటూ నోరూరించాం కాబట్టి ఓ మాట చెప్పాలి. చరణ్‌ అలియాస్‌ చెర్రీకి ట్రూజెట్‌ విమానాల్ని ఎగరేయడమే కాదండోయ్‌.. అప్పుడప్పుడు ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌ కి వెళ్లి బ్రాండెడ్‌ ఐస్‌ క్రీముల్ని లాగించేయడం ఒక హాబీ. స్కూల్‌ డేస్‌ నుంచి ఈ అలవాటుంది. ఈ సంగతిని సదరు పార్లర్‌ వాళ్లే చెప్పారు లెండి. ఏదైనా పార్లర్‌ లో చెర్రీ చెర్రీ ఐస్‌ క్రీమ్‌ తింటున్నప్పుడు 'హాయ్‌' అంటూ చరణ్‌ పలకరిస్తే ఎలా ఉంటుంది? అమ్మాయిలకైతే తనువంతా ఒకటే పులకింతగా ఉండదూ? ఐస్‌ క్రీమ్‌ తో చెలిమి కాన్సెప్టు బావుంది. చరణ్‌-వైట్ల కాంబినేషన్‌ లో సినిమా ఆన్‌ సెట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.