Begin typing your search above and press return to search.

ఖాన్ వార‌సుడితో స్టార్ హీరో వార‌సురాలి స్నేహం!

By:  Tupaki Desk   |   17 July 2022 12:30 PM GMT
ఖాన్ వార‌సుడితో స్టార్ హీరో వార‌సురాలి స్నేహం!
X
సెలబ్రిటీ కిడ్స్ స్నేహాల గురించి.. పార్టీ క‌ల్చ‌ర్ గురించి తెలిసిందే. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా.. రంగుల ప్ర‌పంచంలో కాస్ట్ లీ ఎఫైర్స్ గురించి సామాన్యులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటారు. స్టార్ కిడ్స్ లో చుంకీ పాండే వార‌సురాలు అన‌న్య పాండే- కింగ్ ఖాన్ షారూక్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ తో ఎంతో స్నేహంగా ఉంటుంది. సుహానాఖాన్- అనన్య పాండే- సారా అలీఖాన్ - జాన్వీ లాంటి స్టార్ కిడ్స్ కూడా ఒక‌రితో ఒక‌రు ఎంతో స్నేహంగా ఉంటారు. ఇక సంజ‌య్ క‌పూర్ కుమార్తె స‌న‌యా క‌పూర్ సుహానాతో ఎంతో క్లోజ్ గా ఉంటుంది. సుహానా ఖాన్ కి అహాన్ పాండే ఎంతో స‌న్నిహితుడు అన్న టాక్ ఉంది. అక్ష‌త్ రాంజాన్.. ఓర్హాన్ అనే కుర్రాళ్ల‌తో జాన్వీ స్నేహం కూడా ప‌లు రూమ‌ర్ల‌కు తావిచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా సైఫ్ అలీఖాన్ వార‌సుడు ఇబ్రహీం అలీ ఖాన్ .. స్టార్ హీరో అర్జున్ రాంపాల్ కుమార్తె మహికా రాంపాల్ తో స్నేహంగా ఉండ‌డం గుస‌గుస‌లకు తావిస్తోంది. స్నేహితురాలితో పార్టీ చేసుకుంటూ ఆనందకరమైన క్ష‌ణాల్ని ఖాన్ వార‌సుడు ఆస్వాధిస్తున్న ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఇబ్రహీం అలీ ఖాన్ - మహికా రాంపాల్ బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్ కావ‌డంతో గుస‌గుస‌లు వేగంగా వైర‌ల్ అవుతున్నాయి.

స్టార్ కిడ్స్ ఇద్ద‌రూ ఇంకా నటనలోకి రంగ ప్రవేశం చేయలేదు. కానీ నిరంత‌రం లైమ్ లైట్ లో పేర్లు వినిపిస్తున్నాయి. గత రాత్రి ఆ ఇద్ద‌రూ స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న కొన్ని ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ అయ్యాయి. ఇందులో ఇబ్ర‌హీం ఎంతో ఫిట్ లుక్ తో క‌నిపించాడు. మ‌హికా బెల్లీ అవ‌తార్ యువ‌త‌రంలో హ‌ట్ టాపిక్ అయ్యింది. ఇటీవ‌ల‌ ఇబ్రహీం- మహికాల స్నేహితుడు ఓర్హాన్ అవత్రామణి ఇన్ స్టాలో లండన్ లో ఓ పార్టీ నుండి ఫోటోలను షేర్ చేసాడు. ఈ ఫోటోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత మ‌రోసారి స్నేహితుల పార్టీ ఫోటోలు అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇబ్రహీం ప్రస్తుతం `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` సెట్స్ లో ద‌ర్శ‌కుడు కరణ్ జోహార్ కి స‌హాయ‌కుడిగా ప‌ని చేస్తున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ - అలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ధర్మేంద్ర- జయా బచ్చన్-షబానా అజ్మీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలి చాట్ లో ఇబ్రహీం కెరీర్ గురించి సైఫ్ ఓపెన‌య్యారు. ఇబ్రహీం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాడ‌ని.. కానీ తన కొడుకు కష్టపడి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాన‌ని తెలిపాడు. స్కూల్ లో మెరిట్ లో ఉన్న ఇబ్ర‌హీం భవిష్యత్తు బాగుండాలని ప్రార్థిస్తున్నాను.. అన్నారు.