Begin typing your search above and press return to search.

మలైకా నా జీవితం అంటున్నాడుగా..

By:  Tupaki Desk   |   1 March 2016 9:11 AM GMT
మలైకా నా జీవితం అంటున్నాడుగా..
X
గత కొన్ని నెలలుగా బాలీవుడ్ లో బ్రేకప్ న్యూస్ తప్ప ఒక్క మంచి వార్త కూడా రాలేదు. సెలబ్రిటీలు - స్టార్లు ఒకరి తర్వాత మరొకరు చొప్పున బ్రేకప్ ల కోసం క్యూ కట్టారు. ఇప్పుడు మొదటిసారిగా ఇలాంటి విడిపోవడంపై న్యూస్ వచ్చిన ఒక బాలీవుడ్ జంట.. దీనిపై పెదవి విప్పారు. అర్బాజ్ ఖాన్-మలైకా అరోరాల పెళ్లి జరిగి 17 సంవత్సరాలు పూర్తయింది. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ తమ అనుబంధానికి ముగింపు పలకబోతున్నట్లు వార్తలొచ్చాయి.

ఇప్పటికే విడివిడిగా ఉంటున్న పరిస్థితి పైనా కథనాలు పుష్కలంగా వచ్చాయి. అయితే ఇలా విడిపోవడంపై స్పష్టత ఇవ్వని ఈ జంట.. నేరుగా అడిగితే మాత్రం కసురుకున్నారు. సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఓ టెలివిజన్ షో ద్వారా సమాధానం దొరికింది. 'యార్ మేరా సూపర్ స్టార్' అనే టీవీ కార్యక్రమానికి విడివిడిగా వచ్చిన అర్బాజ్ ఖాన్-మలైకా అరోరాలు.. జంటగా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనసు విప్పి మాట్లాడాడు అర్బాజ్.

'నాకు మలైకా అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఆమెకంటే ఇష్టమైనది నాకు వేరేదేమీ లేదు. తను నాకు దూరమవుతుందని భయంగా ఉంది. గతంలో ఇలా ఉండేది కాదు కానీ.. వయసు పెరిగిన కొద్దీ బంధం బలపడుతుంది' అంటూ చెప్పాడు అర్బాజ్. ఈ బాలీవుడ్ బాబు చెప్పిన మాటలతో.. మలైకా-అర్బాజ్ లు విడిపోవడం ఉత్తుత్తిదేనని తేలిపోయింది.