Begin typing your search above and press return to search.

వాయుసేనను అవమానించారు.. ‘గుంజన్ సక్సేనా’ మేకర్లు సారీ చెప్పాల్సిందే

By:  Tupaki Desk   |   15 Aug 2020 11:10 AM GMT
వాయుసేనను అవమానించారు.. ‘గుంజన్ సక్సేనా’ మేకర్లు సారీ చెప్పాల్సిందే
X
కార్గిల్ యుద్ధ సమయంలో భారత వాయుసేనలో ఐఏఎఫ్ పైలెట్ గా చేసిన గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఇటీవల ఓటీటీలో విడుదలైన సినిమా ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు 3.0 రేటింగ్ వరకు అన్ని సైట్లు ఇచ్చాయి.

దివంగత పాపులర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’ పాత్రలో నటించి మెప్పించింది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి.

ఈ సినిమాలో భారత వైమానిక దళంలో మహిళపై లింగ వివక్ష చూపించారని.. తీవ్రంగా మహిళా పైలెట్లను తొక్కేశారని చూపించారు. దీనిపై భారత వాయుసేన (ఐఏఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ సీన్లు తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

దీంతో ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు. నిర్మాతలు, మేకర్లు భారత వాయుసేనను అవమానించారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక సినిమాలో చూపించినట్టు భారత వాయుసేనలో లింగవివక్ష లేదని నిజమైన మాజీ పైలెట్ గుంజన్ సక్సేనా మీడియాకు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాలో మేకర్లు మసాలా కోసం యాడ్ చేశారని అర్థమవుతోందంటున్నారు. ఈ క్రమంలోనే వివాదం చెలరేగడంతో సినీ నిర్మాతలు చిక్కుల్లో పడ్డారు. దీంతో వాయుసేన కు సారీ చెబుతారా? ఆసీన్లను మేకర్లు తొలగిస్తారా అన్నది చూడాలి.

ధర్మ ప్రొడక్షన్స్, ఎస్సైల్ విజన్ ప్రొడక్షన్స్ పై నిర్మించిన ఈ చిత్రానికి శరన్ శర్మ దర్శకత్వం వహించారు.