Begin typing your search above and press return to search.

అవార్డ్ ఇవ్వాల్సిందే.. లేకపోతే ఫీలవుతా

By:  Tupaki Desk   |   9 Nov 2016 4:20 AM GMT
అవార్డ్ ఇవ్వాల్సిందే.. లేకపోతే ఫీలవుతా
X
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ కు అందంతో పాటు బోలెడంత ప్రతిభ కూడా ఉంది. కెరీర్ లో ఏళ్లు గడిచే కొద్దీ మెల్లమెల్లగా తన ట్యాలెంట్ లో డోస్ పెంచుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ.. కాలంతో పాటు బాగా పరిణతి చెందుతోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన ఉడ్తా పంజాబ్ మూవీలో ఆలియా భట్ నటనకు ఆడియన్స్ అంతా దాదాపు స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చినంత పని చేశారు.

ఆ మూవీలో తన నటనకు ప్రశంసలు రావడం సంగతి అలా ఉంటే.. ఉడ్తా పంజాబ్ తో తనకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వస్తుందని.. ఆలియా బోలెడన్ని హోప్స్ పెట్టేసుకుంది. కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి వచ్చిన ఆలియా.. బోలెడన్ని సంగతులతో పాటు అవార్డ్ విషయం కూడా చెప్పింది. 'నేను నిజాయితీగా చెబుతున్నాను. నీర్జా మూవీలో సోనమ్ కపూర్ అద్భుతంగా నటించింది. అయినా సరే.. ఉడ్తా పంజాబ్ లో నేను చేసిన రోల్ అవార్డ్ రాకపోతే బాధపడతా' అంటోంది ఆలియా.

ఉడ్తాపంజాబ్ లో ఆలియా భట్ చేసిన డీగ్లామ్ రోల్ కు.. దాన్ని ఈమె పండించిన తీరుకు అవార్డు అర్హత కలిగిఉన్న విషయమే. మరి ఆలియా కోరిక ఏ మాత్రం తీరుతుందో!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/