Begin typing your search above and press return to search.

తేజ్‌ కు సక్సెస్‌ వస్తే నేను హ్యాపీ

By:  Tupaki Desk   |   11 July 2021 7:56 AM GMT
తేజ్‌ కు సక్సెస్‌ వస్తే నేను హ్యాపీ
X
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. దేవ కట్టాల కాంబోలో రూపొందుతున్న రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. నేడు సినిమా సంగీత దర్శకుడు మణిశర్మ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు గాన ఆఫ్‌ రిపబ్లిక్ మ్యూజికల్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ హాజరు అయ్యారు. ఆయన ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. కొరటాల శివ మాట్లాడుతూ.. సాయి ధరమ్‌ తేజ్ తో నాకు ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంది. నేను ఆయన్ను ఎప్పుడు కలిసినా కూడా ఎమోషనల్‌ గా ఫీల్ అవుతాను. అందుకే ఆయన ఈ సినిమాతో సక్సెస్‌ దక్కించుకుంటే నేను సంతోషిస్తాను అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు.

ఇంకా కొరటాల శివ మాట్లాడుతూ.. ప్రస్థానం సినిమా చూసిన తర్వాత దర్శకుడు దేవా కట్టా కథ ను ఎంత ఇంట్రెస్ట్‌ గా చెప్పగలరు అనే విషయాన్ని తెలుసుకున్నాను. రిపబ్లిక్ సినిమా కథను కూడా ఆయన అంతకంటే ఇంట్రెస్ట్‌ గా చెప్తాడని నమ్ముతున్నాను అన్నాడు. ఇక మణిశర్మ గారిని ఎందుకు మెలోడీ బ్రహ్మ అంటారో నాకు ఇప్పుడు అర్థం అయ్యిందని.. ఆయన పాటలు అద్బుతం అన్నట్లుగా కొరటాల శివ వ్యాఖ్యలు చేశాడు.

కొరటాల శివ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాకు కూడా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల మళ్లీ మణిశర్మ బిజీ అవ్వడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా పేరు దక్కించుకున్న మణిశర్మ ఆమద్య కాస్త డల్ అయినట్లుగా కనిపించినా మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు పెద్దవి ఉన్నాయి. మరి కొన్ని కూడా చర్చలు జరుగుతున్నాయి.