Begin typing your search above and press return to search.

నేను తాగుతాను.. ద‌మ్ము కొడ‌తాను... చొంగ కార్చే హ‌క్కు మీకు లేదు!-పాయ‌ల్ ఘోష్‌

By:  Tupaki Desk   |   8 Nov 2020 10:15 AM IST
నేను తాగుతాను.. ద‌మ్ము కొడ‌తాను... చొంగ కార్చే హ‌క్కు మీకు లేదు!-పాయ‌ల్ ఘోష్‌
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డారంటూ న‌టి పాయ‌ల్ ఘోష్ మీటూ వేదిక‌గా ఆరోపించిన సంగ‌తి తెలిసిన‌దే. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేసి కోర్టుల ప‌రిధిలో పోరాటం మొద‌లు పెట్టింది. ఈ ఎపిసోడ్ లోకి ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు లాగ‌డంతో పాయ‌ల్ పై వారంతా ప్ర‌తిదాడి చేసి క్షమాప‌ణ‌లు చెప్పేవ‌ర‌కూ వ‌ద‌ల‌ని సంగ‌తి తెలిసిన‌దే.

ఈ వివాదంతో ఒక్క‌సారిగా ఓవ‌ర్ నైట్ పాపులారిటీ పెరిగింది పాయ‌ల్ కి. ఆ త‌ర్వాత ఊస‌ర‌వెల్లి కోస్టార్ ఎన్టీఆర్ పేరును ఈ వివాదంలోకి డ్రాగ్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. తాజాగా పాయ‌ల్ ఓ స్పైసీ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి మ‌హిళా హ‌క్కుల గురించి ప్ర‌స్థావించ‌డం నెటిజ‌నుల్లో విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. నేను తాగుతాను.. ద‌మ్ము కొడ‌తాను... చొంగ కార్చే హ‌క్కు మీకు లేదు అంటూ పాయ‌ల్ ఘోష్ చేసిన వ్యాఖ్య పెను దుమారం రేపుతోంది.

స్త్రీ.. పురుషుల మధ్య పూర్తి సమానత్వం అంతుచిక్కని లక్ష్యం అని ప్రజలలో విస్తృతమైన అవగాహన పెంచాల్సి ఉంది. దురదృష్టవశాత్తు.. పురుషులు మహిళల మధ్య హక్కుల విష‌య‌మై పూర్తి సమానత్వాన్ని సాధించడానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. చట్టం ప్రతి ఒక్కరికీ సమానంగా ఉండాలి. ఒక మహిళగా.. నా జీవితాన్ని గడపడానికి నాకు అన్ని హక్కులు ఉన్నాయి .. నా మార్గం .. నేను తాగవచ్చు.. పొగ త్రాగవచ్చు (చట్టవిరుద్ధం ఏమీ లేదు).. పొట్టి దుస్తులు ధరించవచ్చు .. ఏదైనా కావొచ్చు.. మీ పురుషులకు మీ చొంగ‌ కార్చే (లాలాజలం బయటకు వచ్చే) హక్కు లేదు .. మేము చేస్తాం.. లైవ్ కేర్‌ఫ్రీ పురుషులు జీవించే విధానం .. సింపుల్ గెట్ ఇట్.. లేదంటే జహా సే నిక్లే హో వోహి పె గుసా కే మారుంగి ..అంటూ పాయ‌ల్ ఘోష్ ఆల్మోస్ట్ హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌న‌మే అయ్యింది మ‌రి.