Begin typing your search above and press return to search.
వారిద్దరిపై కేసు పెడుతున్నా: ఎన్నికల అధికారికి హేమ లేఖ
By: Tupaki Desk | 5 Oct 2021 2:45 PM GMT'మా' ఎన్నికల వేడి కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ లోని సభ్యుల పరస్పర విమర్శలతో పరిస్థితి చేయిదాటిపోతోంది. 'మా' ఎన్నికల్లో భాగంగా ఇరు ప్యానెళ్లు ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీచేస్తున్న నటి హేమపై మంగళవారం మాజీ 'మా' అధ్యక్షుడు వీకే నరేశ్, నటి కరాటే కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నటి హేమ స్పందించారు. తన పరువుకు భంగం కలిగించేలా ఓ వీడియో విడుదల చేశారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హేమ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ విడుదల చేశారు.
'సినీ రంగానికి చెందిన నటీనటుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలు జోడించి కొన్నియూట్యూబ్ చానెళ్లలో పోస్ట్ చేయడం గమనించాను. దానికి అడ్డుకట్ట వేయాలని నేను ఉద్యమించాను. గతంలో ఇదే విషయంపై సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ఆ తరహా పోస్టింగులు తగ్గాయి. ఈ సంఘటనకు సంబంధించి నరేశ్, కళ్యాణిలు చేసిన పోస్టులను తొలగించాలని యూట్యూబ్ యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తాను. వీరిద్దరిపై సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేయబోతున్నా.. '' అని హేమ వీడియోలో పేర్కొన్నారు.
కరాటే కళ్యాణి అసభ్యకరమైన ప్రచారాలను కట్టడి చేయాలని ఎన్నికల అధికారి అయిన మిమ్మల్ని కోరుకుతున్నాను. ఎన్నికల సమయంలో 'మా' ప్రతిష్టం దిగజారకుండా చూడాల్సిన వ్యక్తులు బాధ్యాతారహితంగా ప్రవర్తిస్తున్నారు. వారికి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని.. వీరి ప్రవర్తనను సమర్థించే వారికి కూడా సరైన గుణపాఠం చెప్పాలని లేఖలో హేమ పేర్కొన్నారు.