Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అయితే చూడాల‌ని కోరిక‌

By:  Tupaki Desk   |   5 Sept 2021 7:00 PM IST
ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అయితే చూడాల‌ని కోరిక‌
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ముఖ్య‌మంత్రి అవుతారా? అంటే దానికి ప‌వ‌న్ భ‌క్తుడు బండ్ల గ‌ణేష్ త‌ప్ప‌కుండా అవుతార‌ని అన్నారు. తాజాగా ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ గురించి జ‌న‌సేన గురించి ప్ర‌శ్నించ‌గా నిర్మాత కం న‌టుడు బండ్ల ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన పార్టీలో ఎందుక‌ని చేర‌లేదు? కాంగ్రెస్ లోనే ఎందుకు చేరారు? అని ప్ర‌శ్నించ‌గా.. దేవుడిని ఎంత‌వ‌ర‌కూ చూడాలో అంత‌వ‌ర‌కే. ఒక లైన్ మామ‌ధ్య‌ అడ్డుగోడ‌లా ఉంటుంది. దానిని క్రాస్ చేయ‌ను. అలా చేస్తే భ‌స్మ‌మే అని బండ్ల త‌న‌దైన శైలిలో ఛ‌మ‌త్క‌రించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్ప‌టికీ త‌న దేవుడ‌ని ఆయ‌న‌ను ట‌చ్ చేయ‌న‌ని దూరం నుంచే చూస్తాన‌ని అన్నారు. ప‌వ‌న్ సీఎం అయితే జ‌గ‌న్ దిగిపోవాలి క‌దా! అని ప్ర‌శ్నిస్తే దించేస్తార‌ని టైమ్ రావాల‌ని కూడా అన్నారు.

నిర్మాత‌గా వ‌రుస ఫ్లాపులొచ్చాయి. ప‌వ‌న్ మీకు ఆఫ‌ర్ ఇస్తారా? అని ప్ర‌శ్నిస్తే.. నేన‌డిగితే ఎవ‌రైనా డేట్లు ఇస్తారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు అయినా ఇస్తారు... అంటూ బండ్ల అన్నారు. డ‌బ్బుల్లేక సినిమా తీయ‌డం లేద‌ట క‌దా.. తీవ్రంగా న‌ష్ట‌పోయారు అందుకే సినిమాలు తీయ‌డం లేద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది క‌దా! అని ప్ర‌వ్నిస్తే... డ‌బ్బు లేద‌నేది నిజం కాదు. డ‌బ్బు లాస్ అయ్యాను అనేది క‌రెక్టేన‌ని అన్నారు. నేను ఏ సినిమా చేస్తే లాస్ అయ్యానంట‌? అని బండ్ల వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు. ప‌నీ పాటా లేని వాళ్ల మాట‌లు విన‌న‌ని అన్నారు. నేను క్రేజీగా నిజాయితీ గ‌ల వాడిని అవ్వ‌డం అదృష్టం ఫీల‌వుతాను.. అని బండ్ల అన‌డం కొస‌మెరుపు.