Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్స్ గురించి చెబితే పిచ్చికొట్టుడే!!
By: Tupaki Desk | 21 Nov 2016 9:34 AM IST''అసలు ఎవరైనా నా దగ్గరకొచ్చి.. నీకేంటి నువ్వు స్టార్ కిడ్ వి.. అంటే మాత్రం.. వాళ్ళను ఖచ్చితంగా పిచ్చికొట్టుడు కొడతాను. స్టార్ కిడ్స్ అంటే ఉత్తినే సినిమాల్లోకి వచ్చేసి స్టార్లు అయిపోరు. మేం కూడా రోజూ చాలా కష్టపడాలి. బాడీ షేప్ లో ఉండాలి.. యాక్టింగ్ లో దమ్ముండాలి. దానికితోడు మంచి కథలను ఎంచుకోవాలి.. వరుసగా హిట్లు కొట్టాలి. అలా కొట్టని స్టార్ కిడ్ ఎవరైనా అసలు బాలీవుడ్ లో నిలబడ్డారా??'' అంటూ ప్రశ్నిస్తోంది యంగ్ హాటీ ఆలియా భట్.
అమ్మడు అతి చిన్న వయస్సులోనే లిప్ లాక్స్ టు బికినీస్ వరకు అన్నీ వాడేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇంగ్లిష్ వింగ్లిష్ ఫేం గౌరీ షిండే డైరక్షన్లో ''డియర్ జిందగీ'' అనే సినిమాతో త్వరలోనే ధియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ కూడా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా.. మామూలుగా అయితే చాలా కష్టపడితే కాని షారూఖ్ ఖాన్ సరసన హీరోయిన్ అవ్వరు.. కాని నువ్వు మాత్రం భలే ఛాన్సు కొట్టేశావ్ అని ఒక విలేకరి అడగ్గా.. ఆ రేంజులో ఫైర్ అయ్యింది ఈ క్యూటీ.
అంతే కదా.. అమ్మడు చెప్పేది కూడా నిజమే. ఇప్పుడు ఏ ఇండస్ర్టీలోనైనా కూడా.. కేవలం స్టార్ కిడ్స్ అయితే సరిపోదుగా. మనం కూడా చూస్తున్నాం. చాలామంది స్టార్ హీరోల కొడుకులు స్టార్లు కాలేకపోయారు. కొందరు పవర్ ఫుల్ హీరోలు అయితే.. కొందరు ఇంకా ఫ్లాపులే తీస్తున్నారు. హార్డ్ వర్క్ అండ్ లక్ కూడా ఉంటేనే ఎవరైనా కూడా స్టార్ అయ్యేది. వుయ్ ఎగ్రీ విత్ యు ఆలియా!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/