Begin typing your search above and press return to search.

వేధింపులు చూశాక నిద్ర ప‌ట్ట‌లేదు!

By:  Tupaki Desk   |   8 Aug 2019 4:56 AM GMT
వేధింపులు చూశాక నిద్ర ప‌ట్ట‌లేదు!
X
బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `పింక్` చిత్రంలో తాప్సీ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ చిత్రంలో బ‌లాత్కారానికి గురై న్యాయం కోసం పోరాడే అమ్మాయి పాత్ర‌కు జీవం పోసింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అమితాబ్ - తాప్సీ మ‌ధ్య కోర్ట్ సీన్స్ అందులో డైలాగ్స్ కి ప్రేక్ష‌కుల నుంచి గొప్ప స్పంద‌న ద‌క్కింది. తాప్సీ కెరీర్ లో పింక్ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమా త‌మిళ రీమేక్ `నేర్కొండ పార్వాయ్‌`లో తాప్సీ పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తున్నారు? అన్న ఉత్కంఠ నెల‌కొంది.

తాప్సీ పోషించిన పాత్ర‌లో జెర్సీ ఫేం శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ న‌టించింది. తాను ఆ పాత్ర చేయ‌డానికి స్ఫూర్తి ఏమిటి? అంటే ఓ ఇంట‌ర్వ్యూలో శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది. ``నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు నేను దిల్లీలో లా- ఇంట‌ర్న్ షిప్ చేస్తున్నా. ఆ స‌మ‌యంలో ఆ ఘ‌ట‌న న‌న్ను నా త‌ల్లిదండ్రుల్ని ఎంతో భ‌య‌పెట్టింది. క‌ల‌త‌కు గురి చేసింది. క్ష‌ణ‌క్ష‌ణం ఆ యువ‌తి ఉద్వేగం ఎలా ఉందో న‌న్ను వెంటాడింది. సెట్స్ పైనా దానినే త‌ల‌చుకుని నిర్భ‌య‌నే స్ఫూర్తిగా తీసుకుని నటించేశాను. కీలక స‌న్నివేశాల్లో న‌టించేప్పుడు నిర్భ‌య ధైర్య‌మే స్ఫూర్తి నింపింది`` అని తెలిపింది.

ఆ పాత్ర కోసం తాప్సీ ని అనుక‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌లేదని... ఒక‌వేళ త‌నని అనుక‌రించిన‌ట్టుగా ఉంటుంద‌నే భ‌యంతో అస‌లు పింక్ సినిమానే చూడ‌లేద‌ని శ్ర‌ద్ధా వెల్ల‌డించింది. ఇక పింక్ లాంటి చిత్రంలో ఈ త‌ర‌హా పాత్ర చేయ‌డం అంత సులువేమీ కాద‌ని.. త‌ప్ప‌నిస‌రిగా ఆడిష‌న్స్ ని ఎదుర్కోవ‌డ‌మే క‌రెక్ట్ అని శ్ర‌ద్ధా తెలిపింది. నేను నాలా న‌టించేందుకు ప్ర‌య‌త్నించాను. దానిని ప్రేక్ష‌కులే జ‌డ్జ్ చేయాల్సి ఉంటుంది. నా న‌ట‌న తాప్సీకి న‌టిస్తుంద‌నే భావిస్తున్నా. న‌చ్చ‌క‌పోయినా తిట్ట‌ర‌నే అనుకుంటున్నాన‌ని శ్ర‌ద్ధా రివీల్ చేసింది. నేర్కొండ పార్వాయ్ ఈ నెల‌లోనే రిలీజ్ కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.