Begin typing your search above and press return to search.

డాడ్ నాపై అరిస్తే.. నేను సుష్మిత పై అరిచాను!- రామ్ చ‌ర‌ణ్‌

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:22 AM IST
డాడ్ నాపై అరిస్తే.. నేను సుష్మిత పై అరిచాను!- రామ్ చ‌ర‌ణ్‌
X
స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక్కొక్క‌రూ ఒక్కొక్క‌రిపై అరిచే సంద‌ర్భాలు త‌ప్ప‌వు. ముఖ్యంగా కోట్లాది రూపాయ‌లు వెచ్చించి నిర్మించే భారీ చిత్రాల కోసం ప‌ని చేసేప్పుడు ఆన్ లొకేష‌న్ టెన్ష‌న్స్ గురించి వేరే చెప్పాలా? అయితే అలాంటి టెన్ష‌న్స్ లో ఉన్న‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు కోప్ప‌డ‌డం అల‌గ‌డం వ‌గైరా ఉంటాయి.

అలాంటి ఒక అరుదైన విష‌యాన్ని రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఒత్తిడిలో ఒక్కోసారి త‌న‌పై డాడ్ చిరంజీవి అరిచేస్తే.. తాను మాత్రం త‌న సోద‌రి సుస్మిత‌పై అరిచేసేవాడ‌ట‌. అయితే బయ‌టివారిపైనా అరిచి ప‌ని పూర్తి చేసే అల‌వాటు ఉంద‌‌ని న‌వ్వేస్తూ తెలిపారు చ‌ర‌ణ్‌. ఇంత‌కీ ఈ మ్యాట‌ర్ ఎక్క‌డ చెప్పారు? అంటే.. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత డెబ్యూ సిరీస్ ప్ర‌చారంలో తెలిపారు. సుస్మిత‌ నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ నుండి `షూటౌట్ ఎట్ అలైర్` వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ ప్ర‌చారంలో భాగంగా చ‌ర‌ణ్ దాని షోరీల్ ‌ను విడుదల చేశాడు. వెబ్ సిరీస్ తో సుస్మిత ‌నిర్మాత‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

శ్రీకాంత్- నందిని రాయ్- ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లుగా అల‌రించ‌నుంది. రామ్ చరణ్ వెబ్ సిరీస్ మీడియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ సుస్మిత ప్రయోగాల్ని కృషిని ప్రశంసించారు. సుస్మిత తాను న‌టించిన `రంగస్థలం` కోసం స్టైలిస్ట్ గా ప్రారంభ‌మైనా.. తన మొదటి ప్రొడక్షన్ ‘ఖైదీ నెం 150’ కోసం ప‌ని చేసింద‌ని తెలిపారు. చిరంజీవీ చరణ్ వద్ద అరుస్తూ ఉంటే.. చరణ్ సుస్మితపై తన నిరాశను వ్యక్తం చేసే వార‌ట‌. ఆ విష‌యాన్ని గుర్తు చేసుకుంటూ అతను నవ్వుకున్నాడు.

మేం బయటివారిని తిట్టడం లేదా అరవడం ద్వారా పని చేస్తాం! అంటూ న‌వ్వేశారు. కానీ కుటుంబ సభ్యులపై అరిస్తే ఆ త‌ర్వాత‌ ఒకరి ముఖాలను ఒక‌రు తిరిగి ఇంట్లో చూడవలసి ఉంటుంది... పని తరువాత చరణ్ -సుస్మిత ఇద్దరూ ఒక‌రినొక‌రు చూసుకుని నవ్వుకునేవార‌ట‌.

సుస్మిత తాజా ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వ్వాల‌ని త‌న‌కు స‌హ‌య‌రిస్తున్న భ‌ర్త ప్ర‌సాద్ కి థాంక్స్ చెప్పారు చ‌ర‌ణ్‌. క‌రోనా భ‌యాల న‌డుమ ఓటీటీల‌కు ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. థియేట‌ర్లు తెరిచినా ఓటీటీల హ‌వా త‌గ్గ‌ద‌న్న‌ది ఓ అంచ‌నా. ప్రేక్షకులు నిస్సందేహంగా OTT కంటెంట్ కు అలవాటు పడ్డారు. సుష్మిత తన ‘షూటౌట్ ఎట్ అలైర్’ వెబ్ సిరీస్ కి ఇది క‌లిసొచ్చే అంశ‌మే అవుతుంది.