Begin typing your search above and press return to search.

ఘ‌ట్ట‌మ‌నేని యువ‌రాణికి అప్పుడే ఎనిమిది!!

By:  Tupaki Desk   |   20 July 2020 9:45 AM IST
ఘ‌ట్ట‌మ‌నేని యువ‌రాణికి అప్పుడే ఎనిమిది!!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి వార‌సులు గౌత‌మ్ - సితార అంటే పంచ‌ప్రాణాలు అన్న సంగ‌తి తెలిసిందే. వార‌సుల జీవితాల్లో ఎన్నో ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్స్ ని ఆయ‌న సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు చేర‌వేస్తూ నిరంత‌రం త‌న‌ను మించిన సెల‌బ్రిటీల‌ను చేస్తున్నారు. మ‌హేష్ తో పాటుగా సీతా పాపా.. గౌత‌మ్ కి ఫాలోవ‌ర్స్ ఉన్నారంటే అదంతా డాడీ మ‌మ్మీ ప్ర‌మోష‌న్ చ‌లువే.

నేటితో సీతాపాప‌కు 8 వ‌చ్చేశాయ్! అంటూ ఎంతో ఉద్వేగానికి గుర‌య్యారు మ‌హేష్‌. కుమార్తె సీతార ఈ రోజు తన 8 వ పుట్టినరోజు జరుపుకుంది. ‌ఝాము రేతిరిలో 12 గంటలకు సూపర్ స్టార్ ఇంట సంద‌డే సంద‌డి నెల‌కొంది. ఈ స్పెష‌ల్ డే సీతా పాప‌పై భావోద్వేగంతో ప్రేమతో నిండిన సందేశాన్ని మ‌హేష్‌ ట్వీట్ చేశారు.

``చాలా వేగంగా ఎనిమిదిలో అడుగు పెట్టేశావ్. ఎప్పటికీ ఇలానే అప‌రిమితంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు చాలా పుట్టినరోజు శుభాకాంక్షలు`` అని మహేష్ తన గారాల‌ కుమార్తె నుద్ధేశించి ట్వీట్ చేశారు. #SituPapaTurns8 అనే హ్యాష్ ట్యాగ్ ను వైర‌ల్ చేశారు. సితార జీవితంలో అరుదైన‌ క్షణాలకు సంబంధించిన ఓ చిన్న వీడియోను కూడా పంచుకున్నారు. అన్న‌ట్టు ఘట్టమనేని యువరాణి పెద్ద తెర‌పై క‌నిపించేదెపుడో? అందుకోసం మ‌హేష్ అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.