Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లో PK ప్యారీ.. ఏజెన్సీతో కాంట్రాక్ట్!

By:  Tupaki Desk   |   3 March 2020 12:45 PM IST
హాలీవుడ్ లో PK ప్యారీ.. ఏజెన్సీతో కాంట్రాక్ట్!
X
పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న కొమ‌రం పులి(2010)లో న‌టించింది నికీషా ప‌టేల్. పులి పిల్లగా ప‌రిచ‌య‌మైనా.. డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ తో పిల్లి పిల్ల‌లా జారుకోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో చిన్నా చిత‌కా సినిమాల్లో న‌టించి మ‌రింతగా కెరీర్ ప‌రంగా జీరో అయిపోయింది. అటుపై తమిళం స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసింది.

త‌మిళ ప‌రిశ్ర‌మ‌ లో కొన్నేళ్లు గా చిన్నా చిత‌కా అవకాశాలే అయినా కెరీర్ బండిని అలా లాగించేస్తోంది. దిల్లీ టు హైదరాబాద్ - చెన్న‌య్ స్నేహ‌ సంబంధాలు కొన‌సాగిస్తూ క‌థ న‌డిపించేస్తోంది. పీకే స‌ర‌స‌న అత్యంత‌ క్రేజీ గా లాంచ్ అయ్యి దుర‌దృష్ట వ‌శాత్తూ కెరీర్ అలా అవుతుంద‌ని నికీషా సైతం ఊహించ‌లేద‌ట‌. అయినా విధి వైచిత్రి అలాంటిది. ప్ర‌స్తుతం ఈ భామ దక్షిణాది చిత్ర పరిశ్రమను విడిచిపెట్టి తన స్వస్థలమైన లండన్‌ కు మకాం మార్చింది. గుజరాతీ మూలాలున్న‌ బ్రిటిష్ ఎన్నారై కి జన్మించిన నికీషాకి విదేశాలు కొత్తేమీ కాదు. అందుకే ఇప్పుడు బ్రిటీష్ టీవీ-సినిమా పరిశ్రమలో తన అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంద‌ని తెలుస్తోంది.

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తో ఇంటరాక్ష‌న్ లో నికీషా మాట్లాడుతూ.. ఇండియా లో టాప్ స్టార్స్ .. ప్రముఖ దర్శకులతో పని చేయాలనే ఆశతో ఇక్క‌డికి వచ్చినా ఆశించిన‌ది ద‌క్క‌లేద‌ని వాపోయింది. తన కెరీర్ ను సైతం ప‌ణంగా పెట్టి.. ప‌లు చిన్న సినిమాలు.. త‌న ఊహ‌కే అంద‌ని చెత్త సినిమాల‌కు సంతకం చేయడానికి దిగి రావాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. ఇవ‌న్నీ తాను ఊహించ‌నివి అని నికీషా అంది.

ఇక ఇదే నిరాశ‌తో ఇప్పుడు మ‌న‌సు మార్చుకుని ఏకంగా హాలీవుడ్ కే వెళ్లాల‌ని అనుకుంటోంది. ఇందులో భాగంగా నికీషా ఓ లండన్ ఆధారిత (లాస్ ఏంజెల్స్) ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. సాధ్య‌మైనంత‌ త్వ‌ర‌లోనే హాలీవుడ్ లోకి ప్రవేశించాలని కూడా కోరుకుంటోంది. ప్ర‌స్తుతం సౌత్ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. నికీషా న‌టించిన మూడు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో నాలుగు సినిమాలు సెట్స్ కెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఆమె ఈ సినిమాలను పూర్తి చేసే వ‌ర‌కూ లండన్ - చెన్నై మధ్య అటూ ఇటూ తిర‌గాల్సి ఉంటుంది.