Begin typing your search above and press return to search.

ఉన్నవాటి గురించే మాట్లాడుతున్నారు : రష్మీ

By:  Tupaki Desk   |   21 Aug 2018 12:00 PM IST
ఉన్నవాటి గురించే మాట్లాడుతున్నారు : రష్మీ
X
యాంకర్ గా హీరోయిన్ గా రెండు పాత్రలు బాలన్స్ చేసుకుంటూ కెరీర్ చక్కదిద్దుకుంటున్న రష్మీ గౌతమ్ కొత్త సినిమా అంతకు మించి 24న విడుదల అవుతోంది. ఇది ఎలా ఉంటుంది అనే అంచనాలు ఎవరికి పెద్దగా లేవు కానీ పోస్టర్స్ లో పబ్లిసిటీలో రష్మీ అందాల ప్రదర్శనలో బాగా హై లైట్ అయిన తొడల వల్లే అంతో ఇంతో ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. వాటి గురించి ఎవరు అడిగినా అవేనా ఇంకా సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయని రష్మీ చెబుతున్నా ప్రశ్నలు మాత్రం ఆగకపోవడంతో ఇప్పుడు మాట మార్చేస్తోంది. తనకు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ వాటి గురించి మాట్లాడుకుంటున్నారని అందులో తప్పేముంది అన్న తరహాలో కవర్ చేసేస్తోంది. హీరో జై తో పాటు ఇతర కీలక తారాగణం ఉన్నప్పటికీ ఫోకస్ మొత్తం తన మీదే ఉండటం పట్ల రష్మీ ఒకింత ఆనందంగా కూడా ఉంది.

ఆ మధ్య ట్రైలర్ లాంచ్ లో ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రష్మీ గురించే ప్రత్యేకంగా చెబుతూ తన సినిమా హోర్డింగ్ పక్కన అంతకు మించి పోస్టర్ ఉంటే మలుపు తిరిగే దాకా అదే చూస్తుండిపోయానన్న కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దానితోడు టీమ్ సైతం రష్మీ అందాలు చూసుకుంటూ జనాలు ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారు అని మోసేయడం కాస్త అతిశయోక్తిగా ఉంది. జానీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. హాట్ సీన్స్ తో పాటు హారర్ ఎలెమెంట్స్ దట్టించిన అంతకు మించి చిన్న సినిమాల పెద్ద పోటీలో విడుదలవుతోంది. యూనిట్ భాషలో చెప్పాలంటే వీటిని రష్మీ అందాలు పోటీగా నిలబడి తట్టుకుంటాయా లేదా అనేది శుక్రవారం తేలిపోతుంది.