Begin typing your search above and press return to search.

నాకు మూడు, నాలుగు సార్లు పెళ్లి చేశారుః హీరోయిన్

By:  Tupaki Desk   |   31 March 2021 8:00 AM IST
నాకు మూడు, నాలుగు సార్లు పెళ్లి చేశారుః హీరోయిన్
X
యంగ్ హీరో నితిన్‌, హీరోయిన్ కీర్తి సురేష్ జంటా వ‌చ్చిన ‘రంగ్ దే’ ఈ శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. దీంతోపాటు విడుద‌లైన మ‌రో రెండు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో.. మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తోంది రంగ్ దే.

ఈ స‌క్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న చిత్ర‌బృందం.. పోస్ట్ రిలీజ్ ప్ర‌మోష‌న్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా హీరో నితిన్‌, హీరోయిన్ కీర్తి సురేష్ ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌తోపాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాలు కూడా షేర్ చేసుకున్నారు.

కీర్తి సురేష్ త‌న పెళ్లి గురించి మాట్లాడారు. త‌న‌కు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న భ‌ర్త కావాలో చెప్పారు. ఆస్తులు, అంత‌స్తులు.. అందం చందంక‌న్నా.. మాన‌వ‌త్వం ఎక్కువ‌గా ఉన్న‌వాడైతే చాలు అని చెప్పింది కీర్తి. మ‌న‌సు మంచిదైతే త‌న‌కు చాల‌న్న కీర్తి సురేష్‌.. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించ‌ట్లేద‌ని చెప్పింది.

అయితే.. సోష‌ల్ మీడియాలో త‌న పెళ్లి గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించారు. త‌న‌కే తెలియ‌కుండా.. సోష‌ల్ మీడియాలో మూడు నాలుగు సార్లు పెళ్లి చేశార‌ని న‌వ్వేసింది. దీంతో.. రూమ‌ర్లు ఏ స్థాయిలో స్ప్రెడ్ అవుతున్నాయో ఇండైరెక్టుగా చెప్పింది కీర్తి సురేష్‌.