Begin typing your search above and press return to search.
అప్పుడు గంగ్నం స్టైల్.. ఇప్పుడు డాడీ
By: Tupaki Desk | 3 Dec 2015 12:09 AM ISTఓపెన్ గంగ్నం స్టైల్.. అంటూ పాప్ ఆల్బమ్స్ రికార్డులతో చరిత్ర సృష్టించిన సై.. మళ్లీ వచ్చేశాడు. మూడేళ్ల తర్వాత "డాడీ" సాంగ్ తో దుమ్ము రేపేస్తున్నాడు. "ఐ గాటిట్ ఫ్రం మై డాడీ" అంటూ సాగే ఈ ఆల్బంలో.. మ్యూజిక్ నుంచి స్టెప్స్ వరకు సై మార్క్ విచిత్ర హావభావాల నుంచి సన్నివేశాల వరకు.. అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
అప్పుడే పుట్టిన బిడ్డకు సై ఫేస్ ఉండడంతో మొదలయ్యే వీడియో.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. డాడీ ఆల్బంలో అనేక అవతారాల్లో కనిపిస్తాడు ఇతగాడు. తాత, తండ్రి, మనవడుగా ట్రిపుల్ యాక్షన్ కూడా చేసేశాడు. ముగ్గురూ కలిసి స్టెప్స్ వేసి కూడా అలరిస్తారు. ముఖ్యంగా "ఐ గాటిట్ ఫ్రం మై డాడీ" అనే బీట్ వచ్చినపుడు వేసే స్టెప్ అయితే అదుర్స్ అనాల్సిందే.
కాకపోతే గంగ్నం అంత గొప్పగా లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి తోడు ఇది ఒరిజినల్ థీమ్ కాకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్ అనాలి. విలియమ్ తీసిన "ఐ గాటిట్ ఫ్రం మై మమ్మ"సాంగ్ కు ఇది మేల్ వెర్షన్ గా చెప్పాలి. అంతే కాకుండా.. ఓపెన్ గాంగ్నం స్టైల్ లో అంతా ఒరిజినాలిటీనే చూపించిన సై.. ఈ సారి గ్రాఫిక్స్ మీద బాగా ఆధారపడ్డాడు. కాకుంటే.. గాంగ్నం తర్వాత ఈ పాప్ సింగర్ నుంచి వచ్చిన ఆల్బం కావడంతో.. రికార్డులు కొట్టేసే అవకాశాలు ఎక్కువే.