Begin typing your search above and press return to search.

స్టార్‌ అయినా ఆయనకు కుల వివక్ష తప్పలేదట

By:  Tupaki Desk   |   11 Oct 2020 4:00 PM IST
స్టార్‌ అయినా ఆయనకు కుల వివక్ష తప్పలేదట
X
నటుడిగా గుర్తింపు పొంది స్టార్‌ అయిన వారిని.. ప్రముఖ పొలిటీషన్‌ ల విషయంలో చాలా మంది కులం ప్రస్థావన తీసుకు రారు. వారు కులం పేరుతో దూషించబడరు. సామాన్యుల్లో మాత్రం ఇంకా కులం జాడ్యం తప్పడం లేదు. ఎంతో మంది మన దేశంలో కుల వివక్షతను ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్‌ యుగంలో కూడా ఇంకా మా కులం ముందు మీ కులం చిన్నది మీకు మాతో సమానమైన హోదా గౌరవం రాదు అంటూ వివక్షతను చూపిస్తున్న వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ కూడా తన గ్రామంలో కుల వివక్షను ఎదుర్కొన్నాడట.

లాక్‌ డౌన్‌ సమయంలో నవాజుద్దీన్‌ తన గ్రామానికి వెళ్లి పోయారట. అక్కడ తనను ఇంకా కూడా కుల వివక్షతతోనే చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అమ్మమ్మ తక్కువ కులం కు చెందిన మహిళ అవ్వడం వల్లే మా కుటుంబంను గ్రామస్తులు వెలి వేసినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈయన సీరియస్ మెన్‌ అనే వెబ్‌ సిరీస్‌ లో నటించాడు. సుధీర్‌ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన ఆ వెబ్‌ సిరీస్‌ లో నవాజుద్దీన్‌ సిద్దిఖీ దళితుడి పాత్రలో నటించాడు. ఆ సినిమా ప్రమోషన్‌ సందర్బంగా తనకు గ్రామలో ఎదురైన చెడు అనుభవంను తెలియజేశాడు.