Begin typing your search above and press return to search.
సిమెంట్ ఫ్యాక్టరీలు వైన్ షాప్ లు లేవన్న పవన్
By: Tupaki Desk | 6 Dec 2020 10:11 AM IST``నాకు సిమెంట్ కర్మాగారాలు.. వైన్ షాపులు లేవు.. సొంత మీడియాలు మైనింగ్ పరిశ్రమలు లేవ్`` అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ విసిరిన వాక్భాణం ఎవరిపై? ప‌్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా ప్రత్యర్థి నాయకులపై ఆయన సెటైర్లు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
స్టార్ హీరో .. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజల్లో వరద బాధిత రైతుల కష్టాల్ని ఆరా తీస్తూ సందర్శిస్తున్నారు. పవన్ ఈ పర్యటన సందర్భంగా తన పార్టీ సభ్యులనుద్ధేశించి కూడా ప్రసంగిస్తున్నారు. ఒక సమావేశంలో పవన్ ప్రతిపక్ష పార్టీ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
“నేను మళ్ళీ ఎందుకు నటిస్తున్నానని చాలామంది నన్ను అడుగుతున్నారు. కొంతమంది నాయకుల మాదిరిగా కాకుండా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు.. వైన్ షాపులు.. మీడియా హౌస్‌లు.. లేవ్. ఇసుక ఒప్పందాలు మైనింగ్ పరిశ్రమలు లేవు ” అని పవన్ అన్నారు. అతను తన పార్టీ సభ్యులతో మాట్లాడుతూ,..``నేను మళ్ళీ సినిమాల్లో ఎందుకు నటిస్తున్నానని ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాకు వైన్ షాపులు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవని వారికి చెప్పండి`` అని పవన్ అన్నారు. రాజకీయాల్లో మనుగడ కోసం భారీగా నిధి అవసరం. దానిని న్యాయమార్గంలో ఆర్జిస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ ఇంతకుముందే ప్రకటించారు. సినిమాల ద్వారా ఆర్జించడమే తనకు తెలుసునని అన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. తనపై విమర్శల్ని తిప్పి కొట్టేందుకు ఇలా ప్రత్యర్థులపై సెటైర్లు వేశారన్నమాట.