Begin typing your search above and press return to search.

నాకంత‌ టైమ్ లేదు.. ప్రేమ‌పై కృతి శెట్టి బిగ్ స్టేట్మెంట్‌!

By:  Tupaki Desk   |   3 May 2022 2:30 AM GMT
నాకంత‌ టైమ్ లేదు.. ప్రేమ‌పై కృతి శెట్టి బిగ్ స్టేట్మెంట్‌!
X
టాలీవుడ్ లోకి ప్ర‌తి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్లు వ‌స్తుంటారు. కానీ, కొంద‌రు మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఇట్టే ఎట్రాక్ట్ చేసి బోలెడంత క్రేజ్ ను కూడ‌బెట్టుకుంటారు. ఈ లిస్ట్ లో కృతి శెట్టి ఒక‌రు. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అందాల భామ‌.. ప్ర‌స్తుతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో యువ సెన్షేష‌న్ గా మారింది. `సూపర్ 30` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన కృతి శెట్టి.. హీరోయిన్ గా చేసిన తొలి చిత్రం `ఉప్పెన‌`. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన ఈ సినిమా 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

ఉప్పెన స‌క్సెస్ జ్యోష్ నుంచి కృతి శెట్టి బ‌య‌ట ప‌డ‌క‌ముందే.. `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` రూపంలో మ‌రో రెండు సూప‌ర్ హిట్స్ ఆమె ఖాతాలో ప‌డ్డాయి. దీంతో ల‌క్కీ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న‌ కృతి శెట్టికి.. ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ హీరోల‌కే కాదు స్టార్ హీరోల‌కు సైతం కృతి శెట్టి బెస్ట్ ఆప్ష‌న్‌ గా మారుతుంది. అయితే ఈ బ్యూటీ కెరీర్ ప‌రంగానే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ దూసుకుపోతోంది.

అదిరిపోయే ఫొటో షూట్ల‌తో పాటు త‌ర‌చూ చిట్ చాట్ సెష‌న్స్ నిర్వ‌హిస్తూ భారీగా ఫాలోవ‌ర్స్ ను పెంచుకుంటోంది. తాజాగా కూడా కృతి శెట్టి త‌న అభిమానుల‌తో ముచ్చ‌ట్లు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమె ప్రేమ‌పై బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. కృతి శెట్టి మాట్లాడుతూ.. `ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టాను. నేను కోరుకున్న విధంగా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా గ‌డుపుతున్నా.

ప్రేమ గురించి ఆలోచించేంత సమయం నాకు లేదు. కమర్షియల్‌ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాల్లో న‌టించాల‌నుంది. నా పూర్తి ఫోక‌స్ కెరీర్ పైనే ఉంది. మరికొన్నేళ్ల పాటు కూడా కెరీర్‌ మీదనే దృష్టి పెడతా.` అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రేమ‌, పెళ్లి వంటివి ఇప్ప‌ట్లో త‌న లైఫ్ లో లేవ‌ని కృతి శెట్టి ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పేసింది.

కాగా, ఈ యంగ్ బ్యూటీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు చేస్తోంది. అలాగే టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి జోడీగా `ది వారియ‌ర్‌` మూవీలో న‌టించింది. భారీ అంచ‌నాలు ఉన్న ఈ సినిమా జూలై 14న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో విడుద‌ల కానుంది. మ‌రోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య స‌ర‌స‌న బాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు సైన్ చేసింది. ఇది కృతి శెట్టికి తొలి త‌మిళ చిత్రం కావ‌డం విశేషం.