Begin typing your search above and press return to search.

జాతకంపై నాకు నమ్మకం లేదు.. అదృష్టం: రవితేజ

By:  Tupaki Desk   |   10 Feb 2022 4:33 AM GMT
జాతకంపై నాకు నమ్మకం లేదు.. అదృష్టం: రవితేజ
X
క్రితం ఏడాది ఆరంభంలో 'క్రాక్' సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన రవితేజ, ఈ ఏడాది ఆరంభంలో 'ఖిలాడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ తనదైన స్టైల్లో మాట్లాడారు. "తమ్ముళ్లూ ఈ సిట్యువేషన్ ను బట్టి తక్కువమందిమి మాత్రమే కలిశాము.

నెక్స్ట్ టైమ్ మొత్తం అందరం కలుద్దాం. ఈ సినిమాలో నేను ఫస్టు టైమ్ చేసింది అనసూయ .. అర్జున్ గారితో. నిజంగా ఆయన నాకు చాలా స్ఫూర్తిగా అనిపించారు. ఎందుకంటే సినిమా చూసిన తరువాత మీకే తెలుస్తుంది.

ఈ సినిమా టీమ్ లో అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాము. ఈ సినిమాలో నేను బాగున్నాను అని మీకు ఎక్కడైనా అనిపిస్తే ఆ క్రెడిట్ జీకే విష్ణుగారికి వెళుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ .. క్లైమాక్స్ ఫైట్ ను రామ్ - లక్ష్మణ్ గొప్పగా చేశారు. ఈ సినిమాలో కొత్త కొత్త టెక్నీషియన్స్ తో పనిచేశాను. నేను జాతకాన్ని .. అదృష్టాన్ని పెద్దగా నమ్మను. నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నే నమ్ముతాను. ఎక్కడో ఒకటి రెండు పర్సెంట్ మాత్రమే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ మాత్రం కూడా లేకపోతే ఇంతవరకూ రాలేం కదా.

రమేశ్ వర్మను చూస్తే ఆయన జాతకం .. అదృష్టం శాతాన్ని పెంచాలనిపిస్తోంది. ఆ జాతకానికి .. అదృష్టానికి ఒక పేరు ఉంది .. ఒక చిరునామా ఉంది. అది మా కోనేరు సత్యనారాయణగారు. సినిమా రిలీజ్ కూడా కాకముందే ఆయన రమేశ్ వర్మగారికి కారు గిఫ్ట్ గా ఇచ్చారు. మరి రమేశ్ వర్మది మహార్జాతకమా కాదా?. నా డాళింగ్ దేవిశ్రీ ప్రసాద్ తో చాలా గ్యాప్ వచ్చేసింది .. ఇకపై గ్యాప్ రాకూడదు. ఇప్పుడే కాదు నాకు ఎప్పుడూ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ ఏ సినిమాలోనైనా హండ్రెడ్ పెర్సెంట్ ఇన్వాల్వ్ అవుతాడు. అందువల్లనే మంచి అవుట్ పుట్ ఇవ్వగలుగుతున్నాడు.

ఈ సినిమా చూస్తూ నేను ఎంజాయ్ చేశాను .. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నా సినిమా ఏదైనా నేను ఒక యాక్టర్ లా చూడను .. ఒక ఆడియన్ లానే చూస్తాను. ఈ సినిమా బాగుంటే ఆ క్రెడిట్ అంతా వెళ్లేది ఈ టెక్నీషియన్స్ అందరికీ. డింపుల్ మంచి డాన్సర్ .. ఆమె బాడీలో మంచి రిథమ్ ఉంది. ఆల్రెడీ ఒక 20 .. 30 సినిమాలు చేసినదానిలా చేసేసింది. మీనాక్షి మాత్రం 'అట్టా సూడకే' సాంగ్ ను అలా చేస్తుందని నేను అసలు ఊహించలేదు. ఇద్దరూ కూడా డెఫినెట్ గా మంచి స్టార్స్ అవుతారు.

ఇక ఈ సినిమాకి కథను అందించిన శ్రీకాంత్ విస్సాను గురించి చెప్పాలి. ఈ సినిమాను నేను ఒప్పుకోవడానికి రీజన్ ఇతనే. మరో రీజన్ మా కోనేరు సత్యనారాయణ గారు. ఈ సినిమాలోని డైలాగ్స్ వింటూ మీరు ఎంజాయ్ చేస్తారంటే అవి శ్రీకాంత్ విస్సా రాసినవి. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంత టాలెంటెడ్ పర్సన్ ను నాకు పరిచయం చేసినందుకు రమేశ్ వర్మకి థ్యాంక్స్ చెబుతున్నాను. శ్రీకాంత్ విస్సా ఇక ఇరగదీసేయ్. అందరూ కూడా మాస్కులు పెట్టుకుని సినిమాను ఎంజాయ్ చేయండి" అంటూ ముగించారు.