Begin typing your search above and press return to search.

మహేష్ కోసం భలే కథ చెప్పాడే

By:  Tupaki Desk   |   23 April 2018 11:05 PM IST
మహేష్ కోసం భలే కథ చెప్పాడే
X
పూరీ జగన్నాధ్ ఇప్పుడు మెహబూబా ముూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా తీస్తున్న చిత్రం కావడం.. మూవీని తనే నిర్మించడం.. ఈ చిత్రాన్ని పూర్తిగా దిల్ రాజు తన హ్యాండోవర్ లోకి తీసుకుని రిలీజ్ చేస్తుండడం వంటివి.. మెహబూబా పై అంచనాలను పెంచాయి.

మరో మూడు వారాల్లో మూవీ రిలీజ్ ఉండగా.. ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీస్ లో మరింత వేగం పెంచింది మెహబూబా టీం. సాంగ్ లాంఛ్ సందర్భంగా ఓ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించిన పూరీ జగన్నాధ్.. ఈ కార్యక్రమంలో ఆకాష్ చిన్నతనం గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. పోకిరి సినిమా టైంలో.. ఓ సారి తన దగ్గరకు వచ్చిన ఆకాష్.. మహేష్ కోసం ఓ కథ రాశానని చెప్పాడట. సరే.. వాడి బ్రెయిన్ లో ఏముందో విందాంలో అనే ఉద్దేశ్యంతో చెప్పమని అన్నాడట పూరీ.

'మహేష్ బాబుకి ఓ పదేళ్ల వయసున్న ఫ్రెండ్ ఉంటాడు. అతనెవరో కాదు.. వీడే. వీడిని చూడకుండా మహేష్ ఉండలేడు. ఇద్దరూ మాంచి దోస్తులు అన్న మాట. ఓ సారి విలన్స్ అంతా కలిసి మహేష్ బాబును చంపేస్తారు. అందుకు పగ బట్టి ఈ పదేళ్ల కుర్రాడు.. ఆ విలన్స్ ను ఎలా ప్లాన్ చేసి చంపేశాడన్నదే సినిమా స్టోరీ' అని చెప్పిన పూరీ.. ఒకవేళ ఈ కథను మహేష్ కు చెబితే.. ఇద్దరినీ కలిసి కొడతాడు అన్నాడట. తనను హీరో చేసుకుని పక్కన మహేష్ కు ఓ వేషం ఇచ్చాడన్న మాట అంటూ నవ్వేశాడు పూరీ జగన్నాధ్.