Begin typing your search above and press return to search.

అతడి ముందు నగ్నంగా నిలబడతా

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:47 PM IST
అతడి ముందు నగ్నంగా నిలబడతా
X
సూటిగా సుత్తి లేకుండా విషయాన్ని డైరెక్టుగా చెప్పాలంటే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తర్వాతే ఎవరైనా. తన ఆలోచనలో ఏం ఉంటే అది స్పష్టంగా చెప్పేస్తుంది. రణ్ వీర్ తో దీపిక ప్రేమాయణం సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ తమ ఇద్దరి మధ్య ఎంతగా అనుబంధం ఉందో చెప్పడానికి.. దీపిక చెప్పిన మాటలు టాప్ రేంజ్ కి చేరిపోయాయి.

"అతను నా బెస్ట్ ఫ్రెండ్. నేను చాలా సెన్సిటివ్, ఎమోషనల్ వ్యక్తిని. తొందరగా హర్ట్ అవుతాను. నేను అతని ముందు నగ్నంగా మారగలను. అయినా తను నన్ను హర్ట్ చేయడు. మా ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం అలాంటిది. అంతగా ఒకరిని ఒకరు అర్ధం చేసుకన్నాం. నా ఆత్మ రణ్ వీర్ కి ఇచ్చేసినా, నేను హాయిగా బతకగలననే నమ్మకం ఉంది. ఇది చాలా పవిత్రమైన సంబంధం"అంటూ కుండ బద్దలుకొట్టేసింది దీపిక.

ప్రస్తుతం ఈ ప్రేమ పక్షులు ఇద్దరూ కలిసిన నటించిన బాజీరావ్ మస్తానీ మరో వారంలో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల కానుండడం విశేషం. అంతే కాదు.. పెళ్లైన తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానంటూ.. ఈ క్వశ్చన్ ఎవరూ హీరోలను ఎందుకు అడగరు అంటూ ఎదురు ప్రశ్నించింది దీపిక.