Begin typing your search above and press return to search.

నేను తెలుగువారి అల్లుడిని : సోనూసూద్

By:  Tupaki Desk   |   17 Jan 2021 5:34 AM GMT
నేను తెలుగువారి అల్లుడిని : సోనూసూద్
X
లాక్ డౌన్లో సొంత ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడ్డ ఎంతో మంది కార్మికులను, అభాగ్యులను వారి ఇళ్లకు చేర్చి ఆపద్భాందవుడు అయ్యాడు బాలీవుడ్ నటుడు ‘సోనూ సూద్’. ఈ క్రమంలో తన ఇంటిని కూడా తాకట్టు పెట్టి అన్నార్తులకు సహాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు.. సోనూ రీల్ లైఫ్ లో కూడా విలన్ కాదు. దీంతో.. దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 50 రోజులపైబడి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎముకలు కొరికే చలిలోనూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ప్రధాన పాత్రలో ‘కిసాన్’ పేరుతో ఓ చిత్రాన్ని ప్రకటించాడు దర్శకుడు ఇ.నివాస్. రచయిత-దర్శకుడు రాజ్ షాండిల్య సహకారం అందించనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నారు సోనూసూద్. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఆ చిత్రం కోసం పనిచేస్తున్న కార్మికులు వంద మందికి వంద ఫోన్లు కూడా అందించాడు.

లేటెస్ట్ గా.. సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల్లుడు అదుర్స్' లోనూ నటించాడు సోనూ. ఈ సినిమా సక్సెస్ మీట్ లో సోనూ మాట్లాడుతూ.. 'నేను తెలుగు వారి అల్లుడినే.. నా భార్య తెలుగు అమ్మాయే' అన్నాడు. తాను ఎన్ని భాషల్లో సినిమా చేసినా.. తెలుగు సినిమానే తన ఫస్ట్ లవ్ అని చెప్పుకొచ్చాడు సోనూ.