Begin typing your search above and press return to search.

లిప్ లాకులకు సై అంటున్న మిల్కీ

By:  Tupaki Desk   |   6 Dec 2018 11:21 AM IST
లిప్ లాకులకు సై అంటున్న మిల్కీ
X
గ్లామర్ షో.. బోల్డ్ గా యాక్ట్ చేయడం.. లిప్ లాకులకు సై అనడం ఇవన్నీ కథ డిమాండ్ మేరకే ఉంటాయని కొందరు అంటారు. కానీ మరికొందరేమో కావాలని వీటన్నిటినీ సినిమాలో ఇరికించి 'కథ డిమాండ్ చేసింది' అనే సాకు చెప్తారని.. ఇది ఫిలిం ఇండస్ట్రీ లో చాలా సాధారణ విషయం అంటారు. కథ డిమాండ్ చేసింది అంటే చాలు ఏదైనా చెల్లుతుందని వాళ్ళ ఉద్దేశం. తాజాగా తమన్నా ఇప్పుడు ఇలాంటి రాగమే అందుకుంది.

తెలుగు సినిమా లో ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ ట్రెండ్ నడుస్తోందని.. ఇదో మంచి మార్పు అని చెప్పింది. తనకు కూడా బోల్డ్ సినిమాల్లో నటించాలని ఉందని .. కాకపోతే తన వద్దకు అలాంటి కథలు ఇప్పటివరకూ రాలేదని చెప్పింది. మరి లిప్ లాకులకు మీరు రెడీనా అని అడిగితే.. "అదేగా నేను చెబుతోంది" అని లౌక్యంగా సమాధానం చెప్పింది. ఇంతవరకూ తెలుగులో ఒక్క దర్శకుడు కూడా తనను లిప్ కిస్ అడగలేదని.. ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ మారింది కాబట్టి ఫ్యూచర్ లో ఎవరయినా అడుగుతారేమో చూడాలి అని చెప్పింది. కండిషన్ ఏంటంటే 'కథ డిమాండ్ చేయాలట'.

ఇదిలా ఉంటే డిసెంబర్ 7 న రిలీజ్ అవుతున్న తన తాజా చిత్రం 'నెక్స్ట్ ఏంటి" గురించి తమన్నా మాట్లాడుతూ ఈ సినిమా రొమాంటిక్ గా ఉంటుందని.. కానీ లిప్ కిస్సులు లేవని చెప్పింది. అంటే కథ డిమాండ్ చేయలేదేమోనని మనం సరిపెట్టుకోవాలి.