Begin typing your search above and press return to search.
సల్మాన్ నోట పెళ్లి మాట
By: Tupaki Desk | 3 July 2015 3:30 PM GMTఅమీర్ ఖాన్ కొడుకు త్వరలో మెగా ఫోన్ పట్టేంత పెద్దవాడైపోయాడు. షారుఖ్ ఖాన్ కొడుకు హీరోగా రంగప్రవేశం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అమీర్, షారుఖ్ ఎప్పుడో పెళ్లిళ్లు చేసుకుని.. తమ సంతానాన్ని ఆ స్థాయికి తీసుకొస్తుంటే.. మరో ఖాన్ మాత్రం ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని చూస్తున్నారు అభిమానులు. రెండు మూడేళ్లకో గర్ల్ ఫ్రెండ్ను మారుస్తూ వెళ్తున్న సల్మాన్ ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూనే 49 ఏళ్ల వయసుకొచ్చేశాడు. సల్మాన్ ప్రస్తుతమున్న పరిస్థితి చూస్తుంటే ఇక పెళ్లే చేసుకోడేమో అని కూడా అనిపిస్తోంది.
కోర్టు కేసులు వెంటాడుతుండటం.. ఎప్పుడు జైలు వెళ్తాడో తెలియని పరిస్థితి ఉండటంతో సల్మాన్ ఇక పెళ్లి ఊసే ఎత్తడనే ఫిక్సయినట్లున్నారు కుటుంబ సభ్యులు కూడా. ఐతే సల్మాన్ ఈ మధ్య సడెన్గా పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఇప్పటివరకు నా దగ్గరకు పెళ్లి ప్రస్తావన ఏమీ రాలేదు. ఎవరైనా అలా నన్ను సంప్రదిస్తే కచ్చితంగా ఆలోచిస్తా'' అని సల్మాన్ అనడంతో అవాక్కవడం మీడియా వాళ్ల వంతైంది. సల్మాన్ అంతటితో ఆగలేదు. పెద్దలు కుదిర్చిన వివాహమే బెటర్ అని కూడా చెప్పాడు. ''ప్రేమ వివాహం ఒక్కోసారి విఫలమవ్వచ్చు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఒక్కోసారి అది కూడా విఫలమవుతుంటుంది. కానీ అది వ్యక్తుల్ని బట్టే ఉంటుంది'' అంటూ వేదాంతం వల్లించాడు బాలీవుడ్ సీనియర్ బ్యాచిలర్.