Begin typing your search above and press return to search.
రాజకీయ ప్రచారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నిఖిల్
By: Tupaki Desk | 6 April 2019 1:39 PM ISTనిఖిల్ ఈమధ్య ఒక టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో నిఖిల్ పై పలురకాల వార్తలు వచ్చాయి. నిఖిల్ టీడీపీకి మద్ధతిస్తున్నారని కొందరు.. ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యారని కొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మరికొందరు మాత్రం ఎప్పుడూ పవర్ స్టార్ మంత్రం జపించే నిఖిల్ పాలిటిక్స్ వచ్చేసరికి టీడీపీకి మద్ధతిస్తున్నాడని విమర్శించారు.
ఈ వార్తలు.. విమర్శలు నిఖిల్ వరకూ వెళ్ళడంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఒక వీడియోను పోస్ట్ చేసిన నిఖిల్ ఏం జరిగిందో వివరించాడు. "నేను ఈ పార్టీకి సంబంధించిన వాడిని కాదు.. ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు. మా ఫ్యామిలీ మెంబర్ అయిన KE ప్రతాప్ గారు డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి బెస్ట్ విషెస్ చెప్పాను. అక్కడ ఉన్న స్థానిక ప్రజలను మా అంకుల్ కు వోట్ వేయమని అడగడం జరిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి.. చాలా నిజాయితీపరుడు. ఆ ఏరియాకు అయన చాలా గొప్ప సేవ చేశారు. ఆయన నాకు 25 ఏళ్ళుగా తెలుసు.. అందుకే ఆయనకు ఓటు వేయమని నేను అడిగాను. మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. నాకు తెలిసిన మంచి వ్యక్తులకు పార్టీలకు అతీతంగా నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. నేను సపోర్ట్ చేస్తే ఓట్లు పడతాయో లేదో నాకు తెలీదు.. నేనేమీ అంత పెద్దవాడిని అనుకోవడం లేదు. ఒక యాక్టర్ లాగా కాకుండా ఒక భారతీయ యువకుడిగా ఇది నేను ఇది చేస్తున్నాను" అన్నాడు.
పత్తికొండలో నిఖిల్ ప్రచారానికి వెనకున్న కథ అదన్నమాట. ఇప్పటికైనా నిఖిల్ పైన వస్తున్న పొలిటికల్ స్పెక్యులేషన్లకు తెరపడుతుందేమో వేచి చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే నిఖిల్ కొత్త సినిమా 'అర్జున్ సురవరం' రిలీజ్ కానుంది.