Begin typing your search above and press return to search.
అలా చేస్తానని డైరెక్ట్ గా చెప్పేసింది
By: Tupaki Desk | 5 Jan 2019 11:28 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న నటి అంటూ ఇప్పటికే పలు సినిమాలతో నిరూపితం అయ్యింది. జాతీయ అవార్డుతో పాటు పలు అవార్డులను దక్కించుకున్న కంగనా రనౌత్ తో సినిమా చేయడం అనేది దర్శకుడికి పెద్ద సవాల్ తో కూడుకున్న విషయం అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే ఈమె చేసే ప్రతి సినిమా దర్శకత్వంలో కూడా వేలు పెడుతుంది. దర్శకుడికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు, తప పాత్ర పూర్తిగా తాను అనుకునేలా రావాలనుకుంటుంది. దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఉండదనే విమర్శలు ఉన్నాయి.
‘క్వీన్’ సినిమా నుండి తాజాగా ఈమె నటించిన ‘మణికర్ణిక’ చిత్రం వరకు ఈమె దర్శకత్వంలో వేలు పెడుతూనే వచ్చింది. మణికర్ణిక చిత్రం విషయంలో మరీ ఈమె ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవ్వడంతో దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు. దాంతో ఆయన తీసిన సీన్స్ తో పాటు, కొత్తగా పలు సీన్స్ ను మళ్లీ చిత్రీకరించి మణికర్ణిక సినిమాకు ఏకంగా తన పేరును దర్శకురాలిగా వేసుకుంది. తాజాగా మణికర్ణిక విడుదల నేపథ్యంలో కంగనా హైదరాబాద్ లో ప్రమోషన్స్ కోసం హాజరు అయ్యింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దర్శకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ముందు ముందు తాను చేయబోతున్న సినిమాల దర్శకత్వ శాఖల్లో తన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని, ఆ విషయాన్ని ముందే దర్శకులకు చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే సొంతంగా దర్శకత్వంపై ఆసక్తి లేనట్లుగా చెప్పుకొచ్చింది. గతంలో షార్ట్ ఫిల్మ్ లకు దర్శకత్వం చేసిన అనుభవంతో తాను క్రియేటివ్ విషయాల్లో జోక్యం చేసుకుంటానని, దర్శకత్వంపై నాకున్న అవగాహణతోనే నా సినిమాల మేకింగ్ లో జోక్యం చేసుకుంటానని పేర్కొంది. నా సినిమా విషయంలో నేను జోక్యం చేసుకోకుంటే ఎలా అన్నట్లుగా కంగనా డైరెక్ట్ గా, ఓపెన్ గా వేలు పెడతానంటూ చెప్పేసింది.