Begin typing your search above and press return to search.

నేను నా జోన్ లో.. స్టైలిష్‌ ఖిలాడీ రాజా..

By:  Tupaki Desk   |   27 Jun 2021 5:30 PM GMT
నేను నా జోన్ లో.. స్టైలిష్‌ ఖిలాడీ రాజా..
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `ఖిలాడి`. ర‌మేష్ వ‌ర్మ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవ‌ల విదేశాల్లో చిత్రీక‌ర‌ణ సాగించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

మాస్ రాజా ఈ చిత్రంలో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తార‌న‌డానికి తాజాగా రిలీజైన ఈ స్పెష‌ల్ లుక్ ఎగ్జాంపుల్ గా భావించ‌వ‌చ్చు. త‌ళ‌త‌ళా మెరిసే అద్దాల మేడ‌లో టవ‌ర్ బిల్డింగ్ లో ఉన్నాడు మాస్ రాజా. అక్క‌డి నుంచి న‌గరాన్ని ప‌రిశీలిస్తున్నాడు. త‌న నీడ అద్దంలో ప్ర‌తిబింబిస్తోంది. ర‌వితేజ ఈ లుక్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నారు. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోకి `నేను నా జోన్ లో..!!` అంటూ సింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ కొత్త ఫోటో వైర‌ల్ గా మారింది.

డింపుల్ హయాతి- మీనాక్షి చౌదరి ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. హిందీలో స‌ల్మాన్ హీరోగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.