Begin typing your search above and press return to search.
తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చినందుకు సంతోషమే కానీ..!
By: Tupaki Desk | 22 March 2021 11:00 PM ISTకేంద్ర ప్రభుత్వం 67వ నేషనల్ ఫిలిమ్ అవార్డులను ప్రకటించింది. ఈసారి టాలీవుడ్ కు 5 అవార్డులు దక్కాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' చిత్రానికి మూడు అవార్డులు.. నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ'కి రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం - ఉత్తమ చిత్రం(తెలుగు) - బెస్ట్ ఎడిటింగ్ - బెస్ట్ కొరియోగ్రఫీ - బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ కేటగిరీలలో తెలుగు సినిమాకి అవార్డ్స్ వచ్చాయి. తెలుగు సినిమాకి అవార్డ్స్ రావడం పట్ల తెలుగు వారందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరికొన్ని విభాగాలలో తెలుగు చిత్రాలకు అవార్డులు రానందుకు బాధను వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా 2019లో విడుదలైంది. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మొదటి తెలుగువాడిగా నిలచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఒక్క కేటగిరీలో కూడా దక్కకపోవడం పట్ల తెలుగు ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలు పడి తీసిన ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ కానీ, సాంకేతిక విలువలు కానీ ఆకట్టుకొనేలా ఉంటాయి. అయినప్పటికీ మళయాళ 'మరక్కార్' చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్స్ - బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలలో ఎంపిక చేశారు. 2017లో బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి ఎలాంటి అవార్డ్ రాకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి.
ఇదిలావుండగా 2019లోనే సెన్సార్ చేయబడిన 'మరక్కార్' సినిమాకి అవార్డులు ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, మోహన్ లాల్ లాంటి ప్రభావశీలి చిత్రానికి కేంద్రం ఈ అవార్డు ప్రకటించిందని అంటున్నారు. అంతేకాకుండా మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతు ప్రకటిస్తూ వచ్చిన కంగనా రనౌత్ కు 'మణికర్ణిక' 'పంగ' చిత్రాలలు గానూ ఉత్తమ నటి అవార్డు లభించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కంగనా కు 2014లో 'క్వీన్' - 2015లో 'తను వెడ్స్ మను' చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంతకముందు కేంద్రానికి సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ (రుస్తుం) కు అవార్డ్ రావడంపై కూడా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నేషనల్ అవార్డ్స్ ఎంపికలో ప్రతిభ కన్నా రాజకీయ ప్రయోజనాలనే చూస్తారనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రకటించిన పలు అవార్డులను పరిశీలిస్తే ఇది నిజమేనేమో అనే అనుమానం కలగమానదు. ఇక తెలుగు సినిమాల విషయంలో అయితే మరీ చిన్నచూపు ఉంటుందని ఎప్పటి నుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించిన తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రాకపోవడం పట్ల రాజకీయ కారణాలు తప్ప మరే కారణాలు ఉంటాయనేది తెలుగు వారి ప్రశ్న. మరి బెస్ట్ లను ఎంపిక చేసే విషయంలో సెలక్షన్ కమిటీ ఏమేమి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుందో..!