Begin typing your search above and press return to search.

నా వ‌య‌సు ఎంతో దానికే ప‌ర్ఫెక్ట్ గా తెలుసుః హీరోయిన్‌

By:  Tupaki Desk   |   6 Jun 2021 1:30 AM GMT
నా వ‌య‌సు ఎంతో దానికే ప‌ర్ఫెక్ట్ గా తెలుసుః హీరోయిన్‌
X
మెజారిటీ అమ్మాయిలు ఏ విష‌యంలోనైనా లైట్ తీసుకుంటారేమోగానీ.. అందం విష‌యంలో, ఏజ్ మ్యాట‌ర్ లో మాత్రం నో కాంప్ర‌మైజ్‌. ఏ మాత్రం తేడా వ‌చ్చినా అంగీక‌రించ‌రు. లేటెస్ట్ గా.. టాలీవుడ్ బ్యూటీ వ‌ర్ష బొల్ల‌మ్మ కూడా ఈ ప‌రిస్థితిని ఫేస్ చేసింది. ఆమె యాక్చువ‌ల్ ఏజ్ క‌న్నా.. ఓ సంవ‌త్స‌రం ఎక్కువ అనే డిస్క‌ష‌న్ వ‌చ్చింది. దీంతో.. వెంట‌నే క్లారిటీ ఇచ్చేసిందీ బ్యూటీ.

ఆ మ‌ధ్య రిలీజ్ అయిన 'మిడిల్‌క్లాస్ మెలోడిస్‌' చిత్రంలో హీరోయిన్ గా అలరించింది వర్ష. అల‌రించే అభినయంతో, ఆక‌ట్టుకునే ఆందంతో కుర్రాళ్ల గుండెలను పేల్చేసింది. తెలుగులోనే కాకుండా.. ఔటాఫ్ టాలీవుడ్ కూడా ఆఫ‌ర్స్ కొల్ల‌గొట్టేసింది. కోలీవుడ్‌, మోలీవుడ్ అంటూ త‌న టాలెంట్ ను అంద‌రికీ చూపించేస్తోంది.

అయితే.. లాక్ డౌన్ వేళ ఇండ‌స్ట్రీల‌న్నీ ష‌ట్ట‌ర్ క్లోజ్ చేయ‌డంతో.. హీరోయిన్ల పాపులారిటికీ పెద్ద చిక్కే వ‌చ్చిప‌డింది. దీంతో.. అంత‌కు ముందుక‌న్నా రెండింత‌లు ఎక్కువ‌గానే సోష‌ల్ మీడియాలో గ‌డిపేస్తున్నారు. ఆ విధంగా ఫ్యాన్స్ తో నిత్యం ట‌చ్ లో ఉంటున్నారు.

ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో క్వ‌శ్చ‌న్ అవ‌ర్ నిర్వ‌హించింది వ‌ర్ష‌. ''ఆస్క్ మీ'' అంటూ అభిమానులను కోరడంతో.. ''ఓ.. ఎస్'' అంటూ వచ్చేశారు ఫ్యాన్స్. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ ఆన్స‌ర్ చేసింది వ‌ర్ష‌. అయితే.. ఓ అభిమాని వ‌య‌సుకు సంబంధించిన ప్ర‌శ్న వేశాడు.

''మీ వయసు 25 సంవత్సరాలని గూగుల్ చూపిస్తోంది. ఇది నిజమేనా?'' అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన వర్ష.. ''నేను 1996లో జన్మించాను. ఆ లెక్క ప్రకారం నాకు ఇప్పుడు 24 సంవ‌త్స‌రాలు. నా వ‌య‌సు ఎంతో మా అమ్మ‌క‌న్నా గూగుల్ కే ఎక్కువ తెలిసిన‌ట్టుంది.'' అని రిప్లే ఇచ్చింది. మొత్తానికి ఏజ్ విషయంలో ఒక్క సంవత్సరం తేడా వచ్చినా.. ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చేసిందీ బ్యూటీ.