Begin typing your search above and press return to search.

హైప‌ర్ ఉంది.. ఇజం తప్పుకుంది!!

By:  Tupaki Desk   |   21 Sep 2016 1:30 AM GMT
హైప‌ర్ ఉంది.. ఇజం తప్పుకుంది!!
X
ద‌స‌రా సీజ‌న్లో రావాల్సిన రెండు సినిమాల‌పై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సీజ‌న్లో అన్నిటికంటే ముందు వ‌స్తుంద‌నుకున్న ‘ఇజం’ ఇప్పుడిప్పుడే రిలీజ్ కాద‌ని తేలిపోయింది. ప్రారంభోత్స‌వం రోజే సెప్టెంబ‌రు 29న రిలీజ్ అని ప్ర‌క‌టించిన పూరి జ‌గ‌న్నాథ్ మాట నిల‌బెట్టుకోవ‌ట్లేదు. ద‌స‌రా సెల‌వుల అడ్వాంటేజీని సొమ్ము చేసుకుందామ‌ని అక్టోబ‌రు 7న ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని చూశారు కానీ.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఆల‌స్యం కావ‌డంతో ఈ సినిమా అక్టోబ‌రు నెలాఖ‌రుకు వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ‘హైప‌ర్’ మాత్రం మొద‌ట అనుకున్న తేదీనే రాబోతోంది.ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఉన్న సందేహాల‌కు తెర‌దించుతూ 14 రీల్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

‘హైప‌ర్’ కూడా ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కావ‌చ్చ‌న్న చ‌ర్చ‌కు తెర‌దించుతూ.. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌రు 30నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు 14 రీల్స్ ప్ర‌క‌టించింది. ద‌స‌రాకు పోటీ మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ముందు వారం సోలోగా హైప‌ర్ ను రిలీజ్ చేయ‌డానికే నిర్ణ‌యించారు. ‘ఇజంతో కూడా పోటీ త‌ప్పిపోవ‌డంతో 30నే సినిమాను రిలీజ్ చేయ‌డం మంచిద‌ని భావించారు. ‘కందిరీగ’ త‌ర్వాత రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రాబోతున్న సినిమా ఇది. రామ్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టించింది ఈ చిత్రంలో. తండ్రి మీద అతి ప్రేమ చూపించే ఓ కొడుకు క‌థ ఇది. ‘నేను శైల‌జ‌’లో రామ్ మామ‌గా న‌టించిన స‌త్య‌రాజ్ ఇందులో తండ్రి పాత్ర పోషిస్తుండ‌టం విశేషం.