Begin typing your search above and press return to search.

బాలయ్య వార్నింగ్.. ఆది స్పందన ఇది

By:  Tupaki Desk   |   9 Feb 2019 10:19 AM GMT
బాలయ్య వార్నింగ్.. ఆది స్పందన ఇది
X
జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది రీ ఎంట్రీతో మళ్లీ జబర్దస్త్‌ కు మస్త్‌ జోష్‌ నింపాడు. కొన్ని నెలల క్రితం ఒక స్కిట్‌ లో బాలకృష్ణను అవమానించేలా ఆది కామెడీ చేశాడని - దాంతో స్వయంగా బాలయ్య ఫోన్‌ లో ఆదికి వార్నింగ్‌ ఇచ్చాడని - ఇంటికి పిలిపించి మరీ వార్నింగ్‌ ఇచ్చాడని రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుండి ఆది కాస్త తన పంచ్‌ ల్లో వేడిని తగ్గించాడని ఒక వర్గం వారు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేశారు. అయితే ఆ వార్తలన్నీ కూడా పుకార్లే అని ఆది క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ గారు తనను పిలిచి మరీ వార్నింగ్‌ ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదని - అసలు ఎప్పుడు కూడా అలాంటి సంఘటన జరగలేదని పేర్కొన్నాడు. తాను అభి టీం లో ఉన్న సమయంలో ఒక స్కిట్‌ లో ఎన్టీఆర్‌ గెటప్‌ వేయడంతో అభిని నందమూరి అభిమానులు ఎవరో ఫోన్‌ లో బెదిరించారు. ఆ విషయాన్ని నేను అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో దాన్ని మార్చి బాలకృష్ణ గారు నాకు వార్నింగ్‌ ఇచ్చారంటూ కొందరు కల్పించారని ఆది చెప్పుకొచ్చాడు.

బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా సందడి చేస్తున్న ఆది మరో వైపు రాజకీయాల్లో కూడా అడుగు పెడతాడనిపిస్తుంది. ఎందుకంటే పదే పదే ఈయన పవన్‌ కళ్యాణ్‌ పై తనకున్న అభిమానంను మరియు జనసేన పార్టీపై తనకున్న గౌరవంను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇండైరెక్ట్‌ గా సెటైర్స్‌ లు వేస్తూ మెగా ఫ్యాన్స్‌ ను ఎప్పటికప్పుడు మెప్పిస్తున్న ఆది జబర్దస్త్‌ తో పాటు సినిమాల్లో కూడా దూసుకు పోతున్నాడు.