Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం హైపర్ ఆది రెమ్యునరేషన్ అంతనా?

By:  Tupaki Desk   |   13 Oct 2021 9:30 AM GMT
బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం హైపర్ ఆది రెమ్యునరేషన్ అంతనా?
X
బుల్లితెర సంచలనం ‘బిగ్ బాస్’ తాజా సీజన్ లో.. లేటెస్టు ఎపిసోడ్ కు హైపర్ ఆది రావటం.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పోటీ దారుల మీద తమ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి.. పలు వివరాల్ని తాము సేకరించామంటూ.. పంచుల మీద పంచ్ లు వేసిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా జనరేట్ అయిన ఫన్ మామూలుగా లేదన్న మాట వినిపిస్తోంది. వీకెండ్లలో నాగ్ రావట.. అవసరమైన మేర సూచనలు.. సలహాలతో పాటు.. క్లాసులు పీకటం.. ఎలిమినేట్ చేయటం తెలిసిందే. తాజాగా హైపర్ ఆదిని తీసుకొచ్చి చేయించిన 25 నిమిషాల ఎపిసోడ్ బిగ్ బాస్ షోకు అదనపు ఆకర్షణగా మారిందంటున్నారు.

పంచ్ ల మీద పంచ్ లు వేయటమే కాదు.. ఊహించని టైమింగ్ తో చెలరేగిపోయే ఆది.. తాజా ఎపిసోడ్ లో నాగ్ ను సైతం డామినేట్ చేశారని చెప్పాలి. ఈ హైలెట్ ఎపిసోడ్ కు ఆదిని ఎంపిక చేసుకోవటం సరైనదే అన్న విషయంలో మరో మాట లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ 25 నిమిషాల ఎపిసోడ్ కోసం హైపర్ ఆది ఛార్జ్ చేసిన మొత్తం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. పాతికనిమిషాల ఈ ఎపిసోడ్ కోసం హైపర్ ఆదికి ఏకంగా రూ.2 నుంచి రూ.3లక్షల మధ్యలో ఇచ్చారని చెబుతున్నారు. తాను తీసుకున్న ప్రతి పైసాకు న్యాయం చేసేలా హైపర్ ఆది వ్యవహరించారని.. అతడి ఎపిసోడ్ కుసానుకూల స్పందన రావటంతో.. మరోసారి అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు.