Begin typing your search above and press return to search.

నిబంధనలు బ్రేక్ చేసాడని యువహీరోకు చలానా విధింపు..!

By:  Tupaki Desk   |   3 Jun 2021 6:32 AM GMT
నిబంధనలు బ్రేక్ చేసాడని యువహీరోకు చలానా విధింపు..!
X
ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు ట్రాఫిక్ చలానాలు కూడా కడుతుంటారు. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా టాలీవుడ్ యువహీరో నిఖిల్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులకు చలానా కట్టినట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు లెక్కచేయకుండా రోడ్డు పైకి రావడంతో హీరో కారుకు చలానా విధించినట్లు కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే హీరో రేంజ్ రోవార్ కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడం కారణంగానే తాము చలానా విధించామని మీడియాతో పోలీసులు వివరించారట. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా నిఖిల్ కారు కనిపించింది. వెంటనే పోలీసులు వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా సినీ నటుడు నిఖిల్‌కు చెందిన కారుగా వివరణ ఇచ్చాడట.

సెలబ్రిటీ వాహనంకు నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో‌ పోలీసులు చలనా విధించి అక్కడి నుంచి కారు పంపించివేశారు. ఆ తర్వాత హీరో నిఖిల్ ట్రాఫిక్ పోలీసులతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హీరో కారు విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హీరో నిఖిల్.. అర్జున్ సురవరం సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకొని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో ఒకటి థ్రిల్లర్ కాగా మరొకటి లవ్ స్టోరీ కావడం విశేషం. గతంలో కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటితో కార్తికేయ సీక్వెల్ చేస్తున్నాడు.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నిఖిల్ సరసన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే ఇవ్వడంతో నిర్మిస్తున్న '18పేజెస్' సినిమాను సిద్ధం చేస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ లవ్ స్టోరీలో నిఖిల్ సరసన అనుపమనే హీరోయిన్ గా నటిస్తోంది. రెండు సినిమాలు వరుసగా ఒకే పెయిర్ తో రాబోతున్నాయి. మరి ఈసారి ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి. సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అనేసరికి సినిమా కుమారి21ఎఫ్ రేంజిలో హిట్ అవుతుందేమో అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.