Begin typing your search above and press return to search.

ప్రసాద్ ఐమ్యాక్స్ లో ప్రత్యక్షమైన అవతార్..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 10:30 AM GMT
ప్రసాద్ ఐమ్యాక్స్ లో ప్రత్యక్షమైన అవతార్..!
X
జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అవతార్ సీక్వెల్ గా వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక సినిమా ప్రభావం ఎంత ఉంది అన్నది అవతార్ 2 కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమాకు కూడా డైరెక్ట్ తెలుగు స్టార్ హీరో సినిమాలాగా అడ్వాన్స్ బుకింగ్స్, ఫస్ట్ డే కలక్షన్స్ ఉన్నాయి.

ఇవన్ని ఒక ఎత్తైతే అవతార్ సినిమా మీద ఉన్న ఇష్టంతో ఒకతను ఏకంగా ఆ వేషధారణతో థియేటర్ కి వచ్చాడు. అవతార్ 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో ప్రసాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ కి ఒకతను అవతార్ గెటప్ లో కనిపించి అలరించారు.

అవతార్ సినిమా అభిమాని అయిన అతను కోవిడ్ టైం లో వాడిన పీ.పీ.ఈ కిట్ ను ధరించి అవతార్ లానే మేకప్ వేసుకుని సినిమా చూసేందుకు వచ్చారు. విచిత్ర వేషధారణ కలిగిన అతన్ని చూసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

అవతార్ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ విషయంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. జేమ్స్ కామెరాన్ తీసిన అవతార్ 1 అప్పట్లో పెద్ద సంచలనం కాగా అవతార్ 2 అంతకు మించి అనిపించేలా ఉంటుందని అంచనాలు పెంచారు.

సినిమా అనుకున్న విధంగానే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సినిమా రిలీజ్ ముందు కొంత నెగిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ షో నుంచి అవతార్ 2 సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అవతార్ 2 కి తెలుగులో అవసరాల శ్రీనివాస్ మాటలు రాశారు. సినిమా లెంగ్త్ ఒక్కటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది తప్ప మిగతా అంతా జేమ్స్ కామెరాన్ మరోసారి ఆడియన్స్ ని తాను సృష్టించిన మరో సరికొత్త లోకానికి తీసుకెళ్లాడని అంటున్నారు. అవతార్ 2 ఈ పాజిటివ్ టాక్ చూస్తుంటే వరల్డ్ స్క్రీన్ పై ఇది ఓ రేంజ్ వసూళ్లని రాబట్టేలా ఉంది.

అవతార్ 2 సినిమాని జేమ్స్ కామెరాన్ 13 ఏళ్లు కష్టపడి తెరకెక్కించారు. విజువల్ వండర్ గా ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ అందించేలా ఈ సినిమా ఉందని తెలుస్తుంది. సో సౌత్, నార్త్ లో పోటీగా సినిమాలేవి లేవు కాబట్టి అవతార్ 2 బాక్సాఫీస్ దగ్గర కూడా అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.