Begin typing your search above and press return to search.

కరాటే కళ్యాణి ఫిర్యాదు.. శ్రీరెడ్డికి నోటీసులు

By:  Tupaki Desk   |   7 March 2020 5:30 PM IST
కరాటే కళ్యాణి ఫిర్యాదు.. శ్రీరెడ్డికి నోటీసులు
X
టాలీవుడ్ జనాలు వాదులాడుకున్నారు. ఇంటి గుట్టు బయటపెట్టుకున్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కరాటే కళ్యాణి, శ్రీరెడ్డి, రాకేష్ మాస్టర్ లు ఒకరిపై ఒకరు దూషించుకొని రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారం ముదిరి పోలీస్ కేసుల వరకూ వెళ్లింది.

అయితే స్తబ్దుగా ఉన్న వీరి కేసుల్లో తాజాగా కదిలిక వచ్చింది. కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో నటి శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వీటిని తీసుకొని చెన్నై వెళ్లిన ప్రత్యేక బృందం తాజాగా శుక్రవారం ఆమెకు అందజేసినట్టు తెలిసింది.

మొదటగా రాకేష్ మాస్టర్ ఓ యూట్యూబ్ చానెల్ తో మాట్లాడుతూ శ్రీరెడ్డి పై దారుణం కామెంట్స్ చేశాడు. గతాన్ని తవ్వి ఆమె పై ఆడిపోసుకున్నాడు. దీంతో శ్రీరెడ్డి రెచ్చిపోయింది. రాకేష్ మాస్టర్ తోపాటు కరాటే కళ్యాణిపై పరుషమైన అనరాని మాటలతో ఫేస్ బుక్ లైవ్ లో బండ బూతులు తిట్టింది.

శ్రీరెడ్డి విమర్శలకు హర్ట్ అయిన కరాటే కళ్యాణి.. ఆమె మాట్లాడిన వీడియో లింక్ ను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేసి కేసు పెట్టించింది. తాజాగా పోలీసులు స్పందించి శ్రీరెడ్డికి నోటీసులు అందజేయడం తో ఈ వివాదం మలుపుతిరిగింది.