Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో త్వ‌ర‌లోనే డ్రైవ్ ఇన్ థియేట‌ర్‌!

By:  Tupaki Desk   |   22 Feb 2022 8:00 AM IST
హైద‌రాబాద్‌లో త్వ‌ర‌లోనే డ్రైవ్ ఇన్ థియేట‌ర్‌!
X
సినిమా రంగంలో ఇప్ప‌టికే వినూత్న మార్పులు వ‌స్తున్నాయి. థియేట‌ర్‌కు వెళ్లి సినిమాలు చూసే స‌మ‌యం తీరిక లేనివారి కోసం ఓటీటీ వ‌చ్చింది. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు సినిమాలు చూసే వెసులుబాటు వ‌చ్చేసింది. ఇదంతా కూడా టెక్నాల‌జీ మ‌హిమే! అయితే.. ఇప్పుడు మ‌రో అడుగు ముందు వేసిన‌.. తెలంగాణ.. త్వ‌ర‌లోనే తొలి డ్రైవ్ ఇన్ థియేట‌ర్‌ను ఏర్పాటు చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది.

దీనిని రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. దీనిపై చ‌ర్చోప చ‌ర్చ‌లు చేస్తున్నా రు. ఓ ఆర్ ఆర్‌కు స‌మీపంలో ఈ డ్రైవ్ ఇన్ థియేట‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న ఆలోచ‌న చేస్తున్న‌ట్టు అధికార వ‌ర్గాల నుంచి స‌మాచారం. ఓ ఆర్ ఆర్‌కు స‌మీపంలో డ్రైవ్ ఇన్ థియేట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు త‌గిన స్థ‌లం చూడాల‌ని ఆయ‌న అధికారుల‌ను కూడా ఆదేశించిన ట్టు తెలిసింది.

ఇలా డ్రైవ్ ఇన్‌థియేట‌ర్‌ను ఏర్పాటు చేయాలంటే.. మొత్తం 150 ఎక‌రాల స్థ‌లం అవ‌స‌రం అవుతుంద‌ని.. మంత్రి కేటీఆర్‌కు అధికారులు సూచ‌న ప్రాయంగా తెలిపారు.

అదేస‌మ‌యంలో అధునాత హంగుల‌కు కూడా అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఎంత ఖ‌ర్చ‌యినా.. దీనిని ఏర్పాటు చేయాల‌ని.. మంత్రి కేటీఆర్ కృత నిశ్చ‌యంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ థియేట‌ర్ ద్వారా హైద‌రాబాద్ ఖ్యాతి మరింత ఇనుమ‌డిస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఇక‌, ఈ డ్రైవ్ ఇన్ థియేట‌ర్ ఎలా ఉంటుందంటే.. నిర్దేశిత స్థ‌లంలో భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ తెర‌పై నిర్ణీత స‌మ‌యంలో సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ఇక్క‌డ ప్ర‌త్యేకంగా కుర్చీలు.. అలాంటివి ఏమీ ఉండ‌వు. కారుల్లో వ‌చ్చే వారు. స్క్రీన్ ఎదుట పార్కు చేసుకుని కారులో కూర్చునే సినిమాను వీక్షించ‌వ‌చ్చు. అయితే.. దీనికి రుసుములు ఎలా ఉంటాయి? ఫ్రీయేనా? అనే విష‌యాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.