Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ కి థ్యాంక్స్ చెప్పారు.. దేనికోసం?

By:  Tupaki Desk   |   7 Nov 2020 2:00 PM IST
ప‌వ‌ర్ స్టార్ కి థ్యాంక్స్ చెప్పారు.. దేనికోసం?
X
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల మెట్రో రైలు ఎక్కి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. మాదాపూర్ నుంచి అమీర్ పేట్ మీదుగా మియాపూర్ వ‌ర‌కు ప్ర‌యాణించిన ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ ఓ సాధార‌ణ ప్ర‌యాణికుడిగా హ‌ల్ ‌చ‌ల్ చేశారు. బ్లాక్ బ్లేజ‌ర్‌,.. బ్లూ జీన్స్‌.. బ్లాక్ గాగుల్స్‌.. రోలెక్స్ వాచ్ ధ‌రించి మెట్రో ఎక్కిన ప‌వ‌న్ మాదాపూర్ టు మియాపూర్ వ‌ర‌కు ప్ర‌యాణించారు.

ఈ ప్ర‌యాణంలో ప‌లువురు ప్ర‌యాణికుల్ని ప‌ల‌క‌రించారు. ఒక స్టార్ గా కంటే జ‌న‌సేనానిగా అంద‌రితో ఆప్యాయంగా మాట్లాడారు. ద్రాక్షా‌రామం రైతు స‌త్యానారాయ‌ణ‌తో ఆయ‌న‌ ముచ్చ‌టించారు. ప్ర‌స్తుత ప‌రీస్థితులు,... రైతులు ప‌డుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. `వ‌కీల్ ‌సాబ్‌` షూటింగ్ మీయాపూర్ లో జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ మెట్రోలో ప్ర‌యాణించి మియాపూర్ చేరుకున్నారు. దీంతో మెట్రో సంద‌డి సంద‌డిగా క‌నిపించింది.

ఈ నేప‌థ్యంలో మెట్రో యాజ‌మాన్యం ప‌వ‌న్ కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ ‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అన్నీ స‌క్ర‌మంగా పూర్త‌యితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.