Begin typing your search above and press return to search.

హంట్ సెన్సార్ రిపోర్ట్.. సుధీర్ బాబుకు హిట్ దక్కేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 7:30 AM GMT
హంట్ సెన్సార్ రిపోర్ట్.. సుధీర్ బాబుకు హిట్ దక్కేనా?
X
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ హంట్. ఈ సినిమాతో మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ హీరో భరత్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శమిస్తున్నారు.

ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో గతాన్ని మర్చిపోయి మళ్ళీ దానిని చెరిగిపోయిన జ్ఞాపకాలతో ఎలా సాల్వ్ చేశారు అనేది కథలో కీలక పాయింటుగా ఉంది. సుధీర్ బాబు నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడంతో దీని మీద హైప్ భారీగానే ఉంది. ఇదిలా ఉంటే జనవరి 26న రిపబ్లిక్ డే రోజు రిలీజ్ కాబోతోంది. తాజా హంట్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ని కేటాయించారు. యాక్షన్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా సపోర్టింగ్ కనిపించపోతున్నారు. ఈ మధ్యకాలం లో సుధీర్ బాబుకి సాలిడ్ హిట్ అయితే పడలేదు. ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు వచ్చిన సక్సెస్ లో అన్ని కూడా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ కథలతోనే వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు చేసిన కూడా కమర్షియల్ గా సక్సెస్ మాత్రం రాలేదు. అయినా కూడా మరోసారి అలాంటి యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో హంట్ సినిమాని చేశారు.

ఈ నేపథ్యంలోనే హంట్ మూవీపై ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. దానికి తగ్గట్టుకుని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత భరత్ సినిమా లో విలన్ పాత్రలో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీ ప్రేక్షకులు ఏ మేరకు రంజంప చేస్తోంది అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.