Begin typing your search above and press return to search.

అది వింటే ఒళ్లంతా మండుతుంది

By:  Tupaki Desk   |   18 Oct 2015 1:30 PM GMT
అది వింటే ఒళ్లంతా మండుతుంది
X
గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ - ఏక్ థీ డాయన్ - దేడ్ ఇష్కియా సినిమాల‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాదు, అవార్డులు, రివార్డులు అందుకుంది బాలీవుడ్ న‌టి హ్యూమా ఖురేషి. అజహర్ - మేడమ్ ఎక్స్ - విక్టరీస్ హవుస్ .. ప్ర‌స్తుతం ఆన్‌ సెట్స్ ఉన్న చిత్రాలు. నాటక రంగం నుంచి సినీ రంగానికి దూసుకొచ్చింది హ్యూమా ఖురేషీ బాలీవుడ్‌ లో సైలెంటుగా దూసుకెళ్లిపోతోంది.. ఈ అమ్మ‌డు చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ బిట్స్‌...

* బొద్దే ముద్దు. హీరోయిన్ స్లిమ్‌ గానే ఉండాలన్న రూలేం లేదు. నాకు బొద్దంద‌మే క‌లిసొచ్చింది.

* నేను ముక్కుసూటిగా ఉంటా. అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఉన్నప్పుడు మాటలు సూటిగానే వస్తాయి. తప్పు చేసినవాళ్లు, నిజాన్ని దాచిపెట్టేవాళ్లే తడబడతారు.

*నాలో ప్లస్సులు, మైనస్సులు విశ్లేషించాలంటే.. కెమెరా ముందు ఉన్నంతసేపూ నటననే శ్వాసిస్తాను. అదే నా బలం. బలహీనతల గురించి ఎక్కువ ఆలోచించను. ఆలోచించకూడదు కూడా. నేను ఇందులో వీక్ అనుకుంటే అందులో ఎప్పటికీ వీక్‌ గానే ఉంటాం. అన్నీ వచ్చు, అన్నీ చేయగలను అనుకోవాలి.

* ఇండస్ట్రీలో నాకు నచ్చేది, నచ్చనిది ... తెలియాలంటే డిఫరెంట్ పాత్రలు చేయడం ద్వారా ఒక్క జీవితాన్ని వంద రకాలుగా చూస్తాం. ఎన్నో రకాల వ్యక్తుల్ని కలుస్తాం. ఎన్నెన్నో నేర్చుకుంటాం. అది నాకు నచ్చే విషయం. కానీ ప్రైవసీ అన్నది పూర్తిగా పోతుంది. అందరి కళ్లూ మననే వెంటాడు తుంటాయి. అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

*మంచి చెప్పాలంటే కొన్నిసార్లు చెడును చూపించాల్సి ఉంటుంది. చెడు ఎలా ఉంటుందో చూపించి, ఇలా చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు. ఆ క్రమంలో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌ గా నటించాలి అని డెరైక్టర్ చెప్తే సరే అంటాను. చెప్పే మంచిని వదిలేసి, చెప్పిన విధానం గురించే మాట్లాడటం సద్విమర్శ కాదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు.

*మనుషులు దూరమైతే బాధగా ఉంటుంది. మొన్నామధ్య నా స్నేహితుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. షూటింగ్‌ లో బిజీగా ఉండి తన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాను.

*అర్థం లేని కామెంట్లకి కోపం వ‌స్తుంది. మా నాన్న వ్యాపారి. దాంతో ఆయనే నా సినిమాలన్నిటికీ ఫైనాన్స్ చేస్తున్నారని కొందరు రాశారు. మానాన్న ఎందుకు ఫైనాన్స్ చేస్తారు? నేను ఎంతో కష్టపడి బాలీవుడ్‌ లో ఎంటరయ్యాను. ఇంకెంతో కష్టపడి నిలదొక్కుకున్నాను. నన్ను నమ్మి దర్శకులు అవకాశాలు ఇస్తున్నారు. ఇవేమీ తెలుసుకోకుండా ఇలా రాయడం ఏమైనా బాగుందా! ఇలాంటి పిచ్చి కామెంట్లు వింటే ఒళ్లు మండుకొస్తుంది.

* నాకు బల్లి అంటే చచ్చేంత భయం. అది ఎక్కడో గోడమీద కనిపిస్తే నా గుండె ఇక్కడే ఆగిపోతుంది. ఇంక దేనికీ అంత భయపడను.

* నేను ఒంటరిగా ఉండలేను. ఒంటరిగా ఉన్నానన్న ఆలోచన నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు వెంట ఉండరు కదా! అందుకే లైట్లు వేసుకుని, టీవీ ఆన్ చేసి పెట్టి పడుకుంటాను. లేదంటే నిద్ర పట్టదు.