Begin typing your search above and press return to search.

హుమా ఖురేషీ.. బాగా ట్రాన్స్ పరెంట్..

By:  Tupaki Desk   |   23 Jan 2016 3:30 PM GMT
హుమా ఖురేషీ.. బాగా ట్రాన్స్ పరెంట్..
X
గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ తో బాలీవుడ్ కి పరిచయమైన హుమా ఖురేషీ.. తర్వాత మంచి ఆఫర్లతో బాగానే దూసుకుపోతోంది. డి డే - డేడ్ ఇష్కియా వంటి సూపర్బ్ మూవీస్ ఈమె ఖాతాలో ఉన్నాయి. ఈ సుందరి అందాల ఆరబోతలో కూడా బాగానే సత్తా చాటుతుంది. అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ లో కూడా చిందులేస్తూ ఉంటుంది. రీసెంట్ గా లయన్స్ క్లబ్ కి సంబంధించిన ఓ ప్రోగ్రాంలో సందడి చేసింది.

ఏదైనా ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కి వచ్చినపుడు క్లీవేజ్ షో చేయడం అక్కడ కామనే కానీ.. ఈ భామ పబ్లిక్ లో ఇలా కనిపించడం కొంచెం ఆసక్తిని కలిగించింది. అయితే, మిగతా హీరోయిన్స్ మాదిరిగా ఓపెన్ షో చేయకుండా.. ఈమె ట్రాన్స్ పరెంట్ డ్రస్ తో అందాలను ప్రదర్శనకు ఉంచింది. బ్లాక్ థీమ్ తో డిజైన్ చేసిన ఈ ట్రాన్స్ పరెంట్ డ్రస్ లోంచి.. ఈమె లోపలి అందాలు చూడ్డానికి ఇంకా ఇంట్రెస్ట్ ని కలిగించాయి. అన్నట్లు ఈమెకు ఔదార్యం కూడా బాగా ఎక్కువే. ఢిల్లీలోనూ పుట్టి పెరిగిన ఈ భామ.. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం అంటే చీపుళ్లు పట్టుకు ఊడ్చేసి ఫోటోలకు పోజులిస్తే చాలదని చెబుతూ ఉంటుంది.

అలాగే తన వంతుగా చలికాలంలో పేదలకు దుప్పట్లు పంచిపెట్టే ప్రోగ్రాంని ప్రతి ఏటా నిర్వహించడం హుమా ఖురేషీకి అలవాటు. అలాగే పుస్తకాలు అంటే పడి చస్తానని, జీవిత చరిత్రలు చదవడం అంటే బోలెడు ఇంట్రెస్ట్ అని చెబుతోంది హుమా ఖురేషీ.