Begin typing your search above and press return to search.

యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన 'సారంగదరియా'..

By:  Tupaki Desk   |   12 March 2021 9:30 AM GMT
యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన సారంగదరియా..
X
ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లో లేటెస్ట్ 'సారంగదరియా' సాంగ్ సంచలనం సృష్టిస్తోంది. మేకర్స్ ఫిబ్రవరి 28న రిలీజ్ చేసిన ఈ పాట కేవలం మూడు వారాల్లోనే 41మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 7 లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. యువజంట నాగచైతన్య, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో నటించిన లవ్ స్టోరీ మూవీ నుండి సారంగదరియా సాంగ్ విడుదలైంది. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరీ' మూవీ సారంగదరియా పాటతోనే భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న ఈ ఫేమస్ ఫోక్ పాటను మంగ్లీ ఆలపించగా.. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు.

అయితే ఈ పాట లిరిక్స్.. దాని కుడిభుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా సెలియా దానిపేరే సారంగదరియా.. ట్యూన్ ఇప్పటిది కాదు. గతంలో రేలారేరేలా సింగర్ కోమల ఆలపించిన పాట అది. తాజాగా సుద్దాల లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉట్టిపడేలా లిరిక్స్ చేంజ్ చేశారు. ఈ సినిమాకు సిహెచ్ పవన్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమిగోస్ క్రియేషన్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పాటలతో ట్రెండ్ అవుతున్న లవ్ స్టోరీ మూవీ.. ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే విశేషం ఏంటంటే.. సారంగదరియా ఒరిజినల్ సింగర్ కోమల.. లవ్ స్టోరీ ప్రీ-రిలీజ్ వేడుకలో ఇదే పాట పాడనుందట. నిజానికి ఈ సినిమా గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ మహమ్మారి కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. చూడాలి మరి చైతూ - సాయిపల్లవి హిట్టు అందుకుంటారేమో!